- Advertisement -
మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ వేసేందుకు ఆర్వో ఆఫీసుకు పరిగెత్తుకుంటూ వెళ్లిన వీడియో వైరలవుతోంది. నిన్న నకిరేకల్ కాంగ్రెస్ అభ్యర్థి వీరేశం నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం రాజగోపాల్ రెడ్డి చండూరు చేరుకున్నారు. నామినేషన్ వేసేందుకు సమయం దగ్గర పడటం, 100m దూరంలో బారికేడ్లు ఉండటంతో ఆయన పరుగెత్తుకుంటూ వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు
- Advertisement -