- Advertisement -
విశాఖ శ్రీ శారదాపీఠంలో రాజశ్యామల అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈరోజు అమ్మవారు మహేశ్వరి అవతారంలో దర్శనమిచ్చారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములు అమ్మవారి అలంకరణకు హారతులిచ్చి పూజలు చేసారు. లోక కళ్యాణార్ధం చేపట్టిన రాజశ్యామల, చండీ యాగాలు, శ్రీచక్ర నవావరణార్చన, దేవీ భాగవత పారాయణ కొనసాగుతున్నాయి. సాయంత్రం సమయంలో విశాఖ శారదాపీఠం చేపట్టిన సామూహిక కుంకుమార్చనలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు

- Advertisement -



