Monday, January 26, 2026

రాజీవ్ ఆరోగ్యశ్రీ నిరుపేద వర్గాల్లో ఆత్మస్థైర్యం నింపింది: జీవన్ రెడ్డి

- Advertisement -

పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాలలో రెండు గ్యారంటీల స్కీములు ప్రారంభం

జగిత్యాల:  రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం నిరుపేదవర్గాల్లో ఆత్మస్థైర్యం నింపిందని మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన వెంటనే

రాష్ట్ర మహిళలకు మహాలక్ష్మి పథకం పేరిట ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, ఆరోగ్యశ్రీ పరిమితి పది లక్షల పెంచే మరో పథకాన్ని జిల్లా కేంద్రంలోని స్వామి వివేకానంద మినీ స్టేడియంలో శనివారం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, జిల్లా కలెక్టర్  షేక్ యాస్మిన్ బాషా, ఆర్టీసి రీజనల్ మేనేజర్  సూచరితతో కలిసి జండా ఊపి ప్రారంభించారు.

మహాలక్ష్మి పథకం కింద బస్సులో ప్రయాణించే మహిళలకు జీరో టికెట్ జారీ చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన 6 గ్యారంటీల అమలుపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచిన సంగతి తెలిసిందేననీ పేర్కొన్నారు.

rajeev-arogyashri-instills-confidence-in-the-poor-jeevan-reddy
rajeev-arogyashri-instills-confidence-in-the-poor-jeevan-reddy

ఈ సందర్భంలో శనివారం రెండు పథకాలను అమల్లోకి తీసుకువచ్చిందని వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే వివిధ గుర్తింపు కార్డులను చూపించాల్సి ఉంటుందన్నారు.  ప్రభుత్వం తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయం అమలుకు అవసరమైన ఏర్పాట్లు ప్రభుత్వం పూర్తిగావించిందని అన్నారు. మహాలక్ష్మి పథకం కింద రాష్ట్రంలోని మహిళలతో పాటు బాలికలు, ఉద్యోగులు,  ట్రాన్స్ జెండర్లకు కూడా వర్తిస్తుందని వివరించారు. సమాజాన్ని తీర్చిదిద్దడంలో మహిళల పాత్ర కీలకమని చెబుతూ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ పుట్టినరోజు పురస్కరించుకుని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో5లక్షల నుండి 10 లక్షల వరకు పెంచి అమలు చేస్తున్నామని జీవన్ రెడ్డి తెలిపారు.

రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టారని దీంతో నిరుపేదలకు కార్పొరేట్ వైద్య సదుపాయాలు అందించమని ఇప్పుడు 10 లక్షలకు పెంచామని వివరించారు. మహిళలకు ఉచిత బస్ సౌకర్యంతో ఆర్టీసీ బాధ్యత మరింత పెరిగిందన్నారు. గత నాలుగేళ్ళ క్రితం నిలిచిపోయిన బస్సు రూట్లను బస్సులను నడిపించాలని ఆర్ ఎం కు సూచించారు. ఆర్టీసీ బస్సుల్లోనే భద్రతతో కూడిన రవాణా సౌకర్యం ఉంటుందన్నారు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమిట్ మెంట్ ఉన్న నాయకుడని ఇచ్చిన హామీలను నెరవేరుస్తాడన్నారు.

జిల్లా కలెక్టర్  షేక్ యాస్మిన్ బాషా మాట్లాడుతూ మహిళలకు చేయుతనివ్వడానికే  రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచి పథకాన్ని  ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు.  ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై రెండు రోజుల్లోనే రెండు పథకాలకు శ్రీకారం చుట్టడం పట్ల పలువురు మహిళలు హర్షం వ్యక్తం చేశారు. స్టూడెంట్స్ కి సువర్ణకావశమని తెలిపారు.మహిళలు సంతోషంగా ఉంటేనే సమాజం బాగుంటుందని పేర్కొన్నారు.

అనంతరం….మహాలక్ష్మి పథకం తీరును ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి గాను జగిత్యాల, కోరుట్ల, మెట్ పల్లి డిపోల బస్సులను సుందరంగా తీర్చిదిద్ది, పట్టణంలోని ప్రధాన వీధులగుండా ర్యాలీ నిర్వహించారు.

 

ఈ కార్యక్రమంలో టీఎస్ఆర్టిసి కరీంనగర్ రీజనల్ మేనేజర్ సుచరిత, డిపో మేనేజర్ సునీత,మాజీ మున్సిపల్ చైర్మన్లు విజయలక్ష్మి, నాగభూషణం, కౌన్సిలర్లు దుర్గయ్య, నక్క జీవన్, సర్పంచులు తాటిపర్తి శోభారాణి, పొగళ్ల సంధ్యారాణి, ఎంపిపి మసర్ధి రమేష్, ఎంపిటిసి విజయలక్ష్మి,మన్సూర్ అలీ, రఘువీరగౌడ్, డిఇ రాజేశ్వర్,  డిపిఓ దేవరాజు జిల్లా అధికారులు నరేష్, రవీందర్, ఆర్టిఓ వంశిధర్, జగన్మోహన్ రెడ్డి,శ్రీనివాస్ గౌడ్ , శ్రీనివాస్,  గాయత్రి, మధురిమ, మమత,నిహారిక మహిళలు పాల్గొన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్