‘బాలెంల’ లో ఘనంగా రావణ దహనం దీపావళి వేడుకల్లో పాల్గొన్న రజనీకాంత్ సంగాని పటేల్
వాయిస్ టుడే :సూర్యాపేట, అక్టోబర్ 20
Rajinikanth Sangani Patel participates in Diwali celebrations with grand burning of Ravana in ‘Balemla’


సూర్యాపేట జిల్లా ‘బాలెంల’ గ్రామంలో గత 35 ఏళ్లుగా కొనసాగుతున్న సాంప్రదాయ రావణ దహనం వేడుకలు ఈ సంవత్సరం కూడా ఘనంగా నిర్వహించబడ్డాయి. గ్రామ యువకులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మున్నూరు కాపు గ్లోబల్ అసోసియేషన్ కన్వీనర్,సంగానీ వెంచర్స్ ఎండీ రజనీకాంత్ పటేల్ సంగాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “రావణ దహనం అహంకారం, అన్యాయం పై సత్యం, న్యాయం సాధించిన విజయానికి సంకేతం” అని పేర్కొన్నారు. సమాజ ఐక్యత, సాంప్రదాయ విలువల పరిరక్షణలో యువత పాత్ర ముఖ్యమని ఆయన అన్నారు. గ్రామ పెద్దలు, మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని దీపావళి సంబరాలను ఆనందంగా జరుపుకున్నారు.


