- Advertisement -

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
సోదర భావానికి ప్రతీక రక్షాబంధన్ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రక్షాబంధన్ సందర్భంగా గురువారం వెస్ట్ మారెడ్ పల్లి లోని తన నివాసానికి మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి మంత్రి చేతికి రాఖీలు కట్టారు. అమీర్ పేట మాజీ కార్పొరేటర్ తో పాటు బన్సీలాల్ పేట, అమీర్ పేట, సనత్ నగర్, బేగంపేట, మొండా మార్కెట్ తదితర ప్రాంతాల నుండి వచ్చిన మహిళలు, ముస్లీం మహిళలు కూడా మంత్రికి రాఖీలు కట్టి స్వీట్ తినిపించారు. ఈ సందర్భంగా మంత్రి వారికి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో కూడా మంత్రికి రాఖీలు కట్టారు.

- Advertisement -



