భర్తను అరెస్టు చేసేందుకు వచ్చిన పోలీసులకు రాఖీ కట్టిన బొజ్జల సుధీర్ రెడ్డి భార్య
తిరుపతి, ఆగస్టు 31: శ్రీకాళహస్తి మండలం ఊరంతూరు గ్రామంలో ఓ వినూత్న దృశ్యం ఆవిష్కృతమైంది. తన భర్తను అరెస్టు చేసేందుకు వచ్చిన పోలీసులకు భార్య రాఖీ కట్టారు. ఈ దృశ్యం ఇప్పుడు వైరల్‌గా మారుతున్నాయి. తెలుగుదేశంపార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇంచార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చారు. రాఖీ సందర్భంగా తమ ఇంటికి వచ్చిన పోలీసులకు వినూత్నంగా గౌరవించారు సుధీర్‌రెడ్డి భార్య రిషితా రెడ్డి. అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులకు రాఖీలు కట్టారు. వారికి స్వీట్లు తినిపించారు. వాళ్ల కాళ్లకను నమస్కరించి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు.ఈ దృశ్యాలు ఆ జిల్లాలో వైరల్‌గా మారాయి. దీనిపై మాట్లాడిన తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇంచార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి…తనను హౌస్ అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులను అతిథుల్లా భావించి రాఖీలు కట్టినట్టు చెప్పుకొచ్చారు. ఇది ఓ పండుగ వాతావరణంలా అందరూ భావించాలని దీంట్లో ఎటువంటి రాజకీయం లేదని అన్నారు.