- Advertisement -
శివయ్య సేవ లో రక్షా నిఖిల్ ఖడ్సే
Raksha Nikhil Khadse in Shivayya Seva
శ్రీకాళహస్తి నవంబర్ 22
శ్రీకాళహస్తీశ్వరాలయం కు యువజన వ్యవహారాల, క్రీడల మంత్రిత్వ శాఖ కేంద్ర సహాయ మంత్రి రక్షా నిఖిల్ ఖడ్సే శుక్రవారం విచ్చేశారు వారిని దేవస్థానం కార్యనిర్వహణాధికారి టి బాపిరెడ్డి స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేయించారు. రక్షా నిఖిల్ ఖడ్సే స్వామి అమ్మవారి దర్శనం అనంతరం శ్రీ మృత్యుంజయ స్వామి సన్నిధానం వద్ద కేంద్ర సహాయ మంత్రి రక్షా నిఖిల్ ఖడ్సే ని ఆలయ కార్యనిర్వహణాధికారి టీ బాపిరెడ్డి శేష వస్త్రం సత్కరించి శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి తీర్థప్రసాదాలు చిత్రపటాలని అందజేశారు .వేద పండితులు వేదమంత్రాలతో ప్రత్యేకంగా ఆశీర్వదించారు
- Advertisement -