Monday, January 13, 2025

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు నివాళులు అర్పించిన రామగుండం ఎమ్మెల్యే.

- Advertisement -

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు నివాళులు అర్పించిన రామగుండం ఎమ్మెల్యే.

Ramagundam MLA who paid tribute to former Prime Minister Manmohan Singh.

 గోదావరిఖని

భారతదేశం ఆర్థిక సంక్షోభం ఉన్న పరిస్థితుల్లో ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టి దేశ ఆర్థిక వృద్ధిరేటును పరుగులు పెట్టించిన మహోన్నత వ్యక్తి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్  రామగుండం శాసనసభ్యులు  రాజ్ ఠాగూర్  అన్నారు. మన్మోహన్ సింగ్ గారి మృతి పట్ల సంతాపం తెలుపుతూ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో  ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్  మన్మోహన్ సింగ్  చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే  రాజ్ ఠాగూర్  మాట్లాడుతూ..

ఆర్థిక శాస్త్రవేత్తగా తన జీవితాన్ని ప్రారంభించిన మన్మోహన్ సింగ్  అంచలంచెలుగా ఎదుగుతూ దేశ ప్రధానిగా రెండు పర్యాయాలు పనిచేసి భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో  అగ్రగామిగా నిలిపారని అన్నారు. తెలుగు జాతి గర్వించదగ్గ ముద్దుబిడ్డ పివి. నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ ని ఆర్థిక మంత్రిగా నియమించి దేశ ఆర్థిక చరిత్రని మలుపు తిప్పే ఎన్నో సంస్కరణాలు తీసుకువచ్చారని గుర్తు చేశారు. ఎకనామిక్స్ ప్రొఫెసర్ గా పనిచేస్తూ అంచలంచలుగా ఎదిగి ఆర్బిఐ గవర్నర్ గా విధులు నిర్వర్తించి ఆ తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా, అనంతరం 1998 నుండి 2004 మధ్య రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా నుండి 2004 నుండి 2014 వరకు ప్రధానిగా పనిచేసి దేశానికి చేసిన సేవలు అందరికీ స్ఫూర్తిదాయకమని చెప్పారు. నిరాడంబరుడిగా సౌమ్యరుడిగా దేశ రాజకీయాలో, ప్రజల హృదయాల్లో మన్మోహన్ సింగ్  చెరగని ముద్ర వేసుకున్నారని తెలిపారు. చంద్రశేఖర్  ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు  దేశంలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో దేశంలోని బంగారు సంపదను ఇతర దేశాలకు తాకట్టు పెట్టారని, ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ బాధ్యతలు చేపట్టాక పీవీ నరసింహారావు సారధ్యంలో తిరిగి వాటిని దేశానికి తీసుకువచ్చి భారతదేశాన్ని ఆర్థికంగా పటిష్టపరిచారన ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్  పేర్కొన్నారు. ఆయన మరణం దేశానికి, కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని చెప్పారు. మన్మోహన్ సింగ్  కుటుంబానికి మనోధైర్యం కల్పించాలని ఆ భగవంతున్ని కోరారు.
దేశానికి ఆయన చేసిన సేవలు కొనియాడారు
మన్మోహన్ సింగ్  చిత్తశుద్ధి ప్రజాసేవ పట్ల అంగిత భావం మనందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు ఈ శ్రద్ధ దారుణంలో ఆయన కుటుంబ సభ్యులకు ఆత్మీయులకు తన సానుభూతి తెలిపారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్ లో వివిధ విభజన అధ్యక్షులు తదితరులు ఉన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్