- Advertisement -
30 కోట్ల తో రంపచోడవరం నియోజకవర్గ మన్యం రోడ్లకు మహర్ధశ
Rampachodavaram Constituency with 30 crores for manyam roads
– ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి
రంపచోడవరం
రంప ఎమ్మెల్యే మిరియాల శిరీషా దేవి గురువారం నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో మొదటిసారిగా పర్యటించారు. మొదటి సారి ఎమ్మెల్యే అయినా అసెంబ్లీలో ఏజెన్సీ గిరిజనుల కష్టాలు, బాధలు చెప్పడమే కాకుండా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అతికొద్ది కాలంలోనే రంపచోడవరం నియోజకవర్గ రోడ్లు, ఇతర సమస్యల ప్రభుత్వానికి నివేదికలు తయారు చేసి, అందించారు ఎమ్మెల్యే. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం రంపచోడవరం నియోజకవర్గానికి తొలి విడతగా 30 కోట్ల రూపాయలతో ఏడు రోడ్లు మంజూరయ్యాయి.
రోడ్ల శంకుస్థాపన కోసం మారుమూల అటవీ ప్రాంతంలోకి వెళ్లి సరైన రోడ్డు మార్గం లేకున్నా నడిచి కలువలు, గుట్టలు దాటి శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే శిరీష . గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
- Advertisement -