గొఱ్ఱెల కాపరుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షునిగా రాములు
Ramulu as the District President of the Shepherds Welfare Association
పెద్దపల్లి ప్రతినిధి:
జిల్లా గొఱ్ఱెల కాపరుల సంక్షేమ సంఘం అధ్యక్షునిగా మండలంలోని పెద్దకల్వలకు చెందిన సలేంద్ర రాములు యాదవ్ ను నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షులు పోచబోయిన శ్రీహరి యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం తిరుపతి యాదవ్ తెలిపారు. రాష్ట్ర కార్యదర్శిగా వేల్పుల నాగరాజు యాదవ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా తాత రాజు యాదవ్ ల నియామకం చేసినట్లు పేర్కొన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల నర్సయ్య యాదవ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ గొఱ్ఱెల కాపరులు ఆర్థికంగా ఎదగాలనే ప్రధాన ఉద్దేశంతో ఏర్పడిన సంఘమే గొఱ్ఱెల కాపరుల సంక్షేమ సంఘమని అన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు పలమారు మల్లేష్ యాదవ్, గొడుగు రాజ కొమురయ్య, మామిండ్ల ఐలయ్య, జిల్లా ఉపాధ్యక్షులు బత్తిని లక్ష్మణ్ యాదవ్, దాడి చంద్రమౌళి యాదవ్, మెండే అంజయ్య యాదవ్, తమ్మినవేని కొమురయ్య యాదవ్, బండ నిఖిల్ యాదవ్, అల్లి సురేష్ యాదవ్, అమ్ముల భూమయ్య యాదవ్, తాతరాజు యాదవ్, కే. శ్రీనివాస్ యాదవ్, జంగ మహేందర్ యాదవ్, పోల్ రాజు యాదవ్, శంకర్ యాదవ్, సమ్మయ్య యాదవ్, మల్లెత్తుల నాగరాజు యాదవ్, నర్ల సాయి యాదవ్, బత్తుల లింగం యాదవ్, తదితరులు పాల్గొన్నారు.