Thursday, March 26, 2026

ఏసీబీకి పట్టుబడ్డ రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి

- Advertisement -

**** ఫ్లాష్..ఫ్లాష్.. ఫ్లాష్.. ఫ్లాష్..

Ranga Reddy District Additional Collector Bhupal Reddy who was caught by ACB

రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తూ..ఈ నెల 12 న ఏసీబీకి పట్టుబడ్డ భూపాల్ రెడ్డి బాగోతం అంతా ఇంతా కాదు..ఈ అధికారి సర్వీస్ అంతా కూడా భువనగిరి డివిజన్ పరిధిలోనే భువనగిరి,బీబీనగర్, బొమ్మలరామారం,చౌటుప్పల్, యాదగిరిగుట్టలలో ఎమ్మార్వో గా పనిచేస్తూ.. వక్రమార్గంలో అక్రమంగా ప్రజల సొమ్మును స్వాహా చేస్తూ.. కోట్లాది రూపాయలు సంపాదించాడనే ఆరోపణలు మెండుగా వినిపిస్తున్నాయి. కాగా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి వద్ద ఓఎస్డీ గా పనిచేస్తూ.. జగదీశ్వర్ రెడ్డి కనుసన్నల్లోనే మెలుగుతూ… (నీకింత నాకింత అనే దోరణీలో పనిచేస్తూ ) చివరి దశలో భువనగిరి ఆర్డీవో గా వచ్చారు.. భువనగిరి డివిజన్ ఎమ్మార్వోలందరినీ కూడా ఆయన గుప్పిట్లో పెట్టుకుని.. పిల్లర్ల మీద నిలబడ్డట్టుగా నటన చేస్తూ.. కోట్ల రూపాయలు సంపాదించిన ఘనత ఆయనదే అని ప్రజల ఆరోపణలు వినిపిస్తున్నాయి..ఈ అధికారి గెస్ట్ హౌస్ టీచర్స్ కాలనీ లో ఉండేదని,ఎవరు పనిమీద ఆయన వద్దకు వచ్చినా.. ఆయన గెస్ట్ హౌస్ టీచర్స్ కాలనీ కి రమ్మని చెప్పి..లావాదేవీలు మాట్లాడుకునేవారని ప్రజల వినికిడి. ఈయనకు కొంతమంది అధికారులైన బ్రోకర్లు..మరి కొంతమంది బ్రోకర్ గాల్లు కూడా ఉండేదని ప్రజలు చెప్తున్నారు. ఆ బ్రోకర్ గార్లతోటి కూడా మాట్లాడే వారిని..ఈ అధికారి వద్దకు పనిమీద వస్తే పైసలిస్తే కానిపనంటూ లేదని ప్రజలు అంటున్న మాటలు ఇవి…ఈయన జీవితమంతా.. సర్వీస్ అంతా భువనగిరి డివిజన్లోని కొనసాగించాడని తెలుస్తుంది. ఈయన మనసులో ” పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతుంది అని అనుకునేవారు”కానీ ఈయన చేసే తతంగమంతా ప్రజలకు, అధికారులకు తెలుసని.. ఈయనను మాజీ మంత్రి ఆయనను కాపాడాడని పలు విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. ఈయన బ్రదర్ రంగారెడ్డి,హైదరాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడని, ఈయన అండదండలే కాకుండా..మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అండదండలతో ఇంకా ప్రజలను నిలువు దోపిడి దోస్తూనే ఉన్నాడని ప్రజల ఆరోపణలు వినిపిస్తున్నాయి.. ఈ అవినీతి ఉచ్చులో నుండి బయటపడటానికి ఈ తిమింగలం.. ఆయన బ్రదర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడీతో పెద్ద ఎత్తున పైరవీలు చేస్తున్నట్టు తెలిసింది…. కొసమెరుపు:-అయ్యో పాపం.. పాపం..భూపాల్ రెడ్డి సార్..మీరు ఎంత మంచివారు సార్.. పైసలు తీసుకుంటే కాని పని కూడా.. పక్కా చేస్తారని.. అవతల అమాయక వ్యక్తులను ముంచేస్తారని తెలిసింది… కానీ ఏమి పోయేకాలం సార్ మీకు..ఇక సంవత్సరమైతే “రాజులా రిటైర్మెంట్ “అయ్యే వారని.. అయినా.. నీ దగ్గర ఉన్న డబ్బులు నీ ఖాందనంతా కొన్ని సంవత్సరాల పాటు తిన్నా.. తరిగిపోయేది కాదేమోనని…. పాపం ఎంత పనాయే సారు.. అధికారిగా లేనోడి పొట్టగొడితే…. దేవుడు నీ పొట్ట ఎలా గొట్టాడో.. చూడండి…. పైన ఉన్న భగవాన్ అన్నవారు.. మంచోడిని చెడ్డోడిని ఎలా చూస్తాడో చూడండి.. తస్మాత్ జాగ్రత్త..
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్