కుత్బుల్లాపూర్ కుత్బుల్లాపూర్ వాయిస్ టుడే (అక్టోబర్ 31) : రంగారెడ్డి నగర్ 127 డివిజన్ పరిధి లోని నందా నగర్ కి చెందిన వివిధ పార్టీలకు చెందిన 50 మంది నాయకులు, కార్యకర్తలు బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏర్వ వెంకట రమణ ఆధ్వర్యంలో గాజులరామారంలోని పార్టీ కార్యాలయంలో కుత్బుల్లాపూర్ బిజెపి అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ సమక్షంలో బిజెపిలో చేరారు. వారికి కమలం కండువా కప్పి పార్టీలోకి ఆయన స్వాగతించారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేగా శ్రీశైలం గౌడ్ గెలుస్తేనే, అభివృద్ధి సాధ్యమవుతుందని భావించి బిజెపిలో చేరుతున్నట్లు వారు తెలిపారు. ఈ సందర్బంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ…కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి కేపీ వివేకానంద కు ఓటమి భయం పట్టుకుందని…అందుకే ప్రత్యర్థులపై దాడులు చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కు బీ టీం అని అన్నారు. బీజేపీ గెలుపుని ఆపడానికి.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటయ్యాయని అన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా కుత్బుల్లాపూర్ లో బీజేపీ గెలుపుని ఆపలేరని అన్నారు.
పార్టీలో చేరిన వారిలో నిఖిల్ మునిగంటి, గొల్ల మహేష్, గ్యాన్, సామల చింటూ, రాజేష్, వంశీ, శ్రీనాథ్, సన్నీ, పాండు, బిందు వర్ధన్ రెడ్డి, కౌశిక్, ఆఫ్రిది, హర్షిత్, సుధాకర్, సంతోష్ కుమార్, విజయ్, కృష్ణ, రాజేష్ తదితరులు ఉన్నారు.
రంగారెడ్డి నగర్ డివిజన్ నందానగర్ నుండి బీజేపీ లోకి చేరికలు
- Advertisement -
- Advertisement -



