ముగ్గులు భారత  స్త్రీల హస్తకళకు ప్రతిబింబాలు–జిల్లా ఎస్పీ

- Advertisement -

ముగ్గులు భారత  స్త్రీల హస్తకళకు ప్రతిబింబాలు–జిల్లా ఎస్పీ

Rangoli are reflections of Indian women's handicrafts--District SP

రావుల గిరిధర్
వనపర్తి జనవరి-11:
ముగ్గులు భారతీయ మహిళల హస్తకళా నైపుణ్యానికి ప్రతిబింబాలని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్* అన్నారు.

సంక్రాంతి సంబరాలలో భాగంగా జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో  జనమైత్రి క్రీడలలో  భాగంగా జిల్లాలో మహిళలకు ముత్యాల ముగ్గుల పోటీని ఎస్పీ కార్యాలయం క్రీడా ప్రాంగణంలో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. భారతీయుల సంస్కృతి సాంప్రదాయంలో ముగ్గులది ప్రధానమైన పాత్ర అని ఆయన వివరించారు.ఎలాంటి సాధనాలు ఉపయోగించకుండా మన మహిళలు మునివేళ్లతో వేసే ముగ్గులను ప్రపంచంలోని స్త్రీలంతా ఆశ్చర్యంగా చూస్తారని ఎస్పీ వివరించారు.అనాదిగా వస్తున్న ఈ కళలను ప్రోత్సహిస్తూ కాపాడుకోవాలని ఆయన పేర్కొన్నారు.ఎస్పీసతీమణి శ్రీమతి అపర్ణ కుటుంబ సభ్యులతోపాటు పోలీస్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు ఇతర ప్రాంతాలవారు ఉత్సాహంగా పాల్గొన్నారు.విజేతలకు ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్  బహుమతులు ప్రదానం చేశారు.

ఈ కార్యక్రమంలో ఎస్పి  సతీమణి శ్రీమతి, అపర్ణ , డిసిఆర్బి డిఎస్పి,  ఉమామహేశ్వర్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, శ్రీనివాస్, అప్పలనాయుడు, మహిళ ఎస్సైలు, మహిళ, కానిస్టేబుల్, మరియు కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular