సిపిఎం జిల్లా12వ మహాసభలకు భారీగా తరలివెళ్లిన సిపిఎం శ్రేణులు.
Ranks of the CPM who have moved heavily to the 12th Congress of the CPM district.
వాహనాల జెండా ఊపి ప్రారంభించిన పట్టణ కార్యదర్శి శ్రీను
బద్వేలు
కడప జిల్లా సమగ్ర అభివృద్ధికై నేడు ,రేపు కడప నగరంలో జరిగే సిపిఎం కడప జిల్లా 12వ మహాసభలను జయప్రదం చేయుటకు బద్వేలు పట్టణం నుండి భారీగా సిపిఎం శ్రేణులు కడప నగరానికి వెళ్లడానికి వాహనాలను సిపిఎం పట్టణ కార్యదర్శి కె. శ్రీను జెండా ఊపి ప్రారంభించడం జరిగింది.*
ఈ సందర్భంగా సిపిఎం బద్వేల్ పట్టణ కార్యదర్శి కె. శ్రీను మాట్లాడుతూ… నిత్యం పెరుగుతున్న ధరలతో తరుగుతున్న ఆదాయాలతో, నిరుద్యోగంతో సామాన్యులు సతమతమవుతున్నారని, రాష్ట్రం కరువు కోరల్లో చిక్కుకుపోయిందని, వైద్యం, విద్య ఖరీదైన సరుకులు అయ్యాయని, విద్యుత్ చార్జీలు తడిసి మోపిడయ్యాయని, దళితులు,గిరిజనులు, మహిళలు,వెనుకబడిన తరగతులు, మైనార్టీలు ఇతర పేద వర్గాలు నిర్లక్ష్యానికి, అవమానాలకు, అత్యాచారాలకు దాడులకు గురవుతున్నారని, ఈ కష్టాలను తీర్చే చర్యల గురించి శాశ్వత పరిష్కారాల గురించి ప్రభుత్వాలు ఆలోచించడం లేదని, కొన్ని సంక్షేమ స్కీములను అమలు చేస్తే చాలు అన్నట్లు, వాటితోనే ప్రజలందరి సమస్యలు తీరిపోతాయి అన్నట్లు వ్యవహరిస్తున్నారని, మరోవైపు కార్పొరేట్లకు ప్రజలందరికీ ఉమ్మడి సంపదగా ఉన్న భూములను, గనులను, రేవులను, సముద్ర తీరాన్ని ఆఖరికి అడవులను సైతం అప్పనంగా కట్టబెడుతున్నారని, మన ఆంధ్ర రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా చేసిన తర్వాత విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కేంద్రంలో వరుసగా మూడవ సారి అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం హామీలు అమలు చేయడానికి నిరాకరిస్తూ వస్తుందని, రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల మంది ప్రజలను బిజెపి ప్రభుత్వం నిలువునా మోసం చేసిన ఆ విషయంలో టిడిపి నాయకత్వంలోని ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడానికి నోరు మెదపడం లేదని, ఇటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసేలా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ద్రోహాన్ని ధైర్యంగా ఎండగడుతూ నిరంతరం ప్రజల్ని చైతన్యవంతం చేస్తున్నది సిపిఎం అని, విశాఖ ఉక్కు పరిరక్షణ కడప ఉక్కు పరిశ్రమ ,పోలవరం నిర్వాసితుల పునరావాసం, అమరావతి రాజధాని నిర్మాణం, కరువు సమస్యలు, విద్యుత్ చార్జీలు, పన్నుల భారం, ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోతున్న ప్రజల సమస్యల మీద పనిచేస్తూ వాటి పరిష్కారం కోసం ప్రత్యామ్నాయ మార్గాలను సిపిఎం ముందుకు తెస్తున్నదని, ప్రజల మధ్య మత సామరస్యాన్ని ఐక్యతను కాపాడుకోవడానికి ప్రజలను సిపిఎం జాగృతుల్ని చేస్తుందని, అధికార, ప్రతిపక్ష పార్టీల నిరంకుశ ఏకపక్ష పోకడలను రాజీ లేకుండా ప్రతిఘటిస్తూ నానాటికి కరిగిపోతున్న ప్రజాస్వామ్య విలువలను సాంప్రదాయాలను కాపాడుకునేందుకు సిపిఎం ప్రయత్నిస్తుందని, ప్రజల కష్టాల్లో పాలుపంచుకుంటూ ప్రజాసేవ చేయడంలో సిపిఎం ఎప్పుడు అగ్రభాగాన ఉందని, బలహీనులు ఇతర పేదల భూములను కబ్జా చేసే గ్రామీణ పెత్తందారుల ఆగడాలని ప్రతిఘటిస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నదని, సామాన్య ప్రజల కోసం బాధితుల కోసం అనునిత్యం ఉద్యమించే సిపిఎం పార్టీని ప్రజలందరూ ఆదరించి మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం బద్వేల్ పట్టణ కమిటీ సభ్యులు ఎం. చిన్ని, పి. మోక్షమ్మ,ఎస్. రాయప్ప, జి. అనంతమ్మ, ఎస్. కైరున్ బీ, కె. నాగబాబు,సి.సుబ్బారాయుడు, యస్.కె.మస్తాన్,పార్టీ సభ్యులు పి.కొండయ్య, ఎస్.కె ఆదిల్, కె. బాబయ్య, మస్తాన్ బీ, జి. రాజగోపాల్, యు. బాలమ్మ, జి. సుబ్బరాయుడు, ఎస్. ఫాతిమా, బాలస్వామి, వెంకటపతి, వెంకటేశ్వర్లు, జి.శ్రీనివాసులు, శివకృష్ణ, కృష్ణమాచారి తదితరులు పాల్గొన్నారు.