మలుపులు తిరుగుతున్న రన్యా రావు కేసు
బెంగళూరు, మార్చి 19, (వాయిస్ టుడే)
Ranya Rao's case is taking twists and turns
బెంగళూరు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నటి రన్యా రావుకు కష్టాలు రెట్టింపయ్యాయి.రన్యారావు.. అమ్మాయి బాగుందని..ముచ్చటపడేరు. ఖతర్నాక్ లేడీ. అమ్మాయి హీరోయిన్ కదాఅని జాలిపడేరు.. .పక్కా ఫోర్‌ట్వంటీ. ఇప్పడీ బంగారు తల్లి పేరు దేశం మొత్తం మార్మోగుతోంది. గోల్డ్ స్మగ్లింగ్ స్కూల్‌లో కొత్త పాఠాలు నేర్చుకుని.. కిలోల లెక్కన బంగారాన్ని చాలా పకడ్బందీగా.. పద్దతిగా తరలిస్తూ కోట్లు వెనకేసుకుని కూర్చుంది. దొంగ బంగారాన్ని దొర వేషంలో దొంగచాటుగా చేరవేయడంలో ఎన్ని డిగ్రీ పట్టాలు తీసుకుందో కానీ.. కాళ్ల పట్టీల దగ్గర నుంచి నుదుటి పాపటి దాకా పసిడిని ఒడిసి పట్టిదంంటే తస్సాదియ్యా మానవుడి కంటికి కనిపించదు. AI టెక్నాలజీ కెమెరాకు చిక్కదు. రన్యా రావు బెయిల్ పిటిషన్‌పై విచారణను బెంగళూరు కోర్టు వాయిదా వేసింది. రన్యా రావుతో పెళ్లి విషయంపై ఆమె భర్త జతిన్ హుక్కేరి కోర్టుకు సంచలన విషయాలు వెల్లడించారు. రన్యతో తనకు గత నవంబరులో పెళ్లి జరిగిందని , కాని డిసెంబర్ నుంచే తాము విడిగా ఉంటున్నామని కోర్టుకు తెలిపారు. కాకపోతే తాము అధికారికంగా విడిపోలేదని, కొన్ని కారణాల వల్ల వేరుగా ఉంటున్నామని చెప్పారు.బంగారం స్మగ్లింగ్ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగు లోకి వచ్చాయి. బెంగళూరు మాత్రమే కాకుండా గోవా , ముంబై నుంచి కూడా రన్యా రావు దుబాయ్‌కు వెళ్లినట్టు DRI అధికారులు వెల్లడించారు. హవాలా మార్గంలో డబ్బులతో బంగారం స్మగ్లింగ్ జరుగుతోందని అనుమానాలు వ్యక్తం చేశారు. 45 సార్లు దుబాయ్‌కు ఉదయం వెళ్లిన రన్యా సాయంత్రానికి తిరిగి వచ్చినట్టు తెలిపారు.గోల్డ్ స్మగ్లింగ్ కేసులో రన్యా రావు భర్త జతిన్‌పై ఈనెల 24వ తేదీ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కర్నాటక హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే జతిన్‌కు వ్యతిరేంగా పిటిషన్ వేస్తామని DRI అధికారులు వెల్లడించారు. గత నవంబర్‌లో బెంగళూరులోని హోటల్ తాజ్ వెస్ట్ ఎండ్‌లో రన్య- జతిన్ వివాహం జరిగింది. . ఈ సింగారమ్మ గోల్డ్ దెబ్బకు ఇప్పుడు కర్నాటక రాజకీయ కూసాలు కదిలిపోతున్నాయి. అసలే కన్నడ పాలిటిక్స్ ఎంత ఇంపుగా ఉంటాయో అందరికి తెలుసు. ఎక్కడ ఏ దగుల్బాజీ దందా జరిగినా.. దానికి అక్కడి పాలిటిక్స్‌కు లింకయి సింకై.. రచ్చ రచ్చ చేస్తుంటాయి. ఇప్పుడదే జరుగుతోందక్కడ. పోనీ అక్కడ దాకా ఆగిందా అంటే.. ఐపీఎస్ ఆఫీసర్ల దాకా పాకింది. ప్రొటోకాల్ రగడ అంటుకుంది. పోనీ అంతటితో ఆగిందా అనుకుంటే..చివరకు మన టాలీవుడ్ కొంపకూ నిప్పు అంటుకుంది. తరుణ్ రాజ్ కొండూరు అట. పాపం ఈ పిలకాయ పరిచయం అనే సినిమాతో టాలీవుడ్ జనాలకు పరిచయం అయ్యాడు. తర్వాత పత్తాలేకుండా పోయాడు. చివరికి రన్యారావు పణ్యమా అని ఈ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో తేలాడు.పసిడి దందాలో ఈ పిలకాయకీ ఘనమైన వాటానే ఇచ్చింది రన్యా మేడమ్. తురుణ్‌కు విరాట్ అని ఇంకో పేరు కూడా ఉంది. రన్యారావుతో 2019నుంచి తరుణ్‌రాజ్‌కు పరిచయం ఉన్నట్లు డీఆర్ఐ విచారణలో తేలింది. అప్పట్నుంచి క్రమ క్రమంగా రన్యారావుతో క్రమం తప్పకుండా సంబంధాలు కొనసాగిస్తూ, అవి కాస్తా అక్రమాలకు దారి తీసేంతగా వారి మధ్య బంధం బలపడిందట. అదెలాగో చెప్పే ముందు మనం రన్యారావు తన స్టేట్‌మెంట్‌లో ఎన్ని సుద్ధపూస కబుర్లు చెప్పిందో ఇక్కడ నోట్ చేయాల్సిన అవసరం ఉంది. నేను చాలా అమాయకురాలిని. ఫస్ట్ టైమ్ గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్నాను. గతంలో ఎన్నడూ ఇలాంటి దొంగపని చేయలేదు. యూట్యూబ్‌లో గోల్డ్ స్మగ్లింగ్ ఎలా చేయాలో నేర్చుకున్నాను. దాని ప్రకారమే బంగారం తరలించే పనికి ఒప్పుకున్నాను. అంతే తప్ప నాకెలాంటి పాపం తెలియదు. నేను చాలా మంచిదాన్ని అంటూ ఓ స్టేట్‌మెంట్ పోలీసులకు ఇచ్చింది. ఇంకో స్టేట్‌మెంట్‌లో ఎవడో తనను బ్లాక్‌మెయిల్ చేశాడని, బంగారం తరలిచ్చేలా తనపై ఒత్తిడి చేశాడని, అందుకే తానిలా చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది.రావుపై బీజేపీ ఎమ్మెల్యే బసన్నగౌడ పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె తన శరీరంలోని అన్ని భాగాల్లో బంగారాన్ని దాచి స్మగ్లింగ్ చేసిందన్నారు. “మంత్రులకు ఈ కేసుతో సంబంధం ఉంది. సెక్యూరిటీని దుర్వినియోగం చేశారు. శరీరం లోని అన్ని భాగాల్లో బంగారాన్ని దాచారు. కేంద్రం ఎవరిని కాపాడే ప్రయత్నం చేయలేదు. కస్టమ్స్ అధికారుల ప్రమేయం ఉంటే కచ్చితంగా వాళ్లపై కూడా చర్యలు ఉంటాయి” బసన్నగౌడ పాటిల్ వ్యాఖ్యానించారు.