యువతిపై అత్యాచారం..
ఆపై బెదిరింపులు
హైదరాబాద్
డిగ్రీ చదివే యువతికి మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేసిన యువకులు, అంతటితో ఆగకుండా ఆమె న్యూడ్ ఫోటోలు సేకరించి బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ వ్యవహారంపై ఫిర్యాదు అందుకున్న బోరబండ పోలీసులు జీరో ఎఫ్ఐర్ నమోదు చేసి ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. బోరబండ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. – డిగ్రీ చదివే యువతి, ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉండేది. ఆమెకు ఇన్స్టాగ్రామ్లో గతేడాది ప్రణవ్ పరిచయమ య్యాడు. ఇద్దరూ కళాశాల దగ్గర కలిసేవారు. గతేడాది యువతి చదివే కళాశాల వద్దకు వెళ్లి ఎల్బీనగర్లో ఇంటి వద్ద దింపుతానని ద్విచక్రవాహ నంపై తీసుకెళ్లాడు. ఇంటికి కాకుండా హోటల్ కు తీసుకువెళ్లి తాగునీటిలో మత్తుమందు కలిపి యువతి స్పృహ కోల్పోయాక ప్రణవ్, మరో యువ కుడు కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత కోలుకున్న యువతి భయపడి ఇంట్లో విషయం చెప్పలేదు. రెండు నెలల క్రితం యువతి నివాసం బోరబండకు మార్చారు. అత్యాచారం విషయాన్ని ఎవ రికీ చెప్పకపోవడాన్ని అవకాశంగా తీసుకున్న నిందితులు ఫోన్ చేశారు. ఆమె నగ్న చిత్రాలు తమ దగ్గర ఉన్నాయని, తాము చెప్పినట్లు వినాలని బెదిరించారు. వేధింపులు ఎక్కువ కావడంతో యువతి తల్లిదండ్రులకు చెప్పగా శనివారం బోరబండ ఠాణాలో ఫిర్యాదు చేశారు.
డిగ్రీ చదివే యువతిపై అత్యాచారం..
- Advertisement -
- Advertisement -