తిరుమల శ్రీవారిసాలకట్ల బ్రహ్మోత్సవాల్లో బాగంగా ఉభయదేవేరులతో కూడిన శ్రీమలయప్పస్వామివారి రథోత్సవంఅంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు.బ్రహ్మోత్సవాలలో ఎనిమిదో రోజున ఉభయ దేవేరులతో మలయప్పస్వామిని మహోన్నత రథంపై అధిష్ఠింపజేసి ఆలయ వీధులలో విహరింపజేశారు. శ్రీవారికి భక్తులు అడుగడుగునా నీరాజనాలు సమర్పించారు. గోవిందనామస్మరణతో ఆలయ మాడవీధులు మారుమోగాయి.

తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు టీటీడీ ఆధ్వర్యంలో వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ మలయప్పస్వామివారు వెన్నముద్ద కృష్ణుడి అలంకారంలో దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో సెప్టెంబర్ 24న ఉదయం శ్రీవారు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. పరిమళ భరిత పూలమాలలు, విశేష ఆభరణాలతో అలంకృతులైన స్వామి వారు నాలుగు మాడవీధులలో విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు, కోలాటాలు, డప్పు నృత్యాలు, సంప్రదాయ వేష ధారణలతో వాహన సేవ ముందు ఆకట్టుకున్నాయి.




