Sunday, September 8, 2024

అర్హులైన అందరికి రేషన్ కార్డులు

- Advertisement -

హైదరాబాద్, డిసెంబర్ 12: తెలంగాణ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరగానే మంత్రులు శాఖల వారీగా సమీక్షలు మొదలు పెట్టారు. మొదటిసారిగా సివిల్ సప్లై డిపార్ట్ మెంట్‌పై రివ్యూ చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఆ శాఖకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు, కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అంశాలపై ఆరా తీశారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు వంద రోజుల్లో పూర్తి చేసే పనిలో ఉన్నామని, ఆ దిశగా పనిచేస్తామని మంత్రి స్పష్టం చేశారు.సివిల్ సప్లై శాఖపై రివ్యూ చేసిన మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రెండు కోట్ల 80 లక్షల మంది రేషన్ లబ్ధిదారులు ఉండగా అందులో 90 శాతం మంది కూడా సరిగ్గా రేషన్ తీసుకోవట్లేదని అన్నారు. రేషన్ పంపిణీ విషయం లో నాణ్యత పాటించాలని, పేదలు తినే బియ్యంలో క్వాలిటీ ఉండాలని అధికారులకు సూచించారు మంత్రి. రైతుల దగ్గర నుండి కొన్న బియ్యానికి తక్షణమే డబ్బుల చెల్లింపు చేపట్టాలని ఆదేశించారు.సివిల్ సప్లై శాఖ పై సమీక్షలో చాలా విషయాలు తెలుసుకున్నానని తెలిపిన మంత్రి.. గత ప్రభుత్వం ఈ డిపార్ట్‌మెంట్‌ను నిర్లక్ష్యం చేసిందన్నారు. ఆర్థికంగా సహాయం చేయక పోవడంతో రూ. 56 వేల కోట్లు అప్పుల్లో సివిల్ సప్లై శాఖ ఉందన్నారు. ఇందులో 11వేల కోట్ల రూపాయల నష్టాల్లో సివిల్ సప్లై కార్పొరేషన్ ఉందని అన్నారు. ప్రస్తుతానికి రూ. 18వేల కోట్ల విలువైన ధాన్యం రైస్ మిల్లర్ల వద్ద ఉందని, దీనిపై ఏం చేయాలనేది కేబినెట్‌లో చర్చిస్తామన్నారు. మొత్తంగా 1.17లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సివిల్ సప్లై వద్ద ఉందన్న విషయం వెలుగులోకి వచ్చిందని మంత్రి తెలిపారు.అయితే, ఈ శాఖపై మరోసారి సమీక్ష చేసి, కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఎలా చేయాలి.. అనర్హులైన వారు చాలా మంది రేషన్ కార్డు పొంది ఉన్నారని, వారిని ఏ విధంగా తీసేయాలనే అంశాలని వీలైనంత త్వరగా సమీక్షిస్తామన్నారు. అలాగే పెండింగ్ లో ఉన్న కొత్త రేషన్ కార్డు అప్లికేషన్లు, ఇప్పటి వరకు అర్హులైన వారికి రాని రేషన్ కార్డులను త్వరలోనే అందిచే ప్రయత్నం చేస్తామని అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్