- Advertisement -
ఆర్హులైన వారందరికి రేషన్ కార్డులు
Ration cards for all eligible
హైదరాబాద్
అర్హత కలిగిన ప్రతి నిరుపేద కుటుంబానికి రేషన్ కార్డులు అందిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
రాష్ట్రంలో సోమవారం నుంచి గ్రామసభల ద్వారా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందన్నారు ప్రతి లబ్ధిదారుడి ఇంటికి అధికారులే వచ్చి సంక్షేమ పథకాలను అందజేస్తారని, ఈ నెల 26 నుంచి సంక్షేమ పథకాలు అమలవుతాయని తెలిపారు. ఆయన ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ. భూమిలేని నిరుపేదలకు ఇందిరమ్మ ఆత్మీయభరోసా పథకం ద్వారా రెండు దఫాలుగా 12వేలు, రైతుభరోసా కింద సాగు యోగ్యమైన భూములకు 12 వేలు అందిస్తామన్నారు.
- Advertisement -