Sunday, September 8, 2024

రౌద్రం కవితా పుస్తక ఆవిష్కరణ

- Advertisement -

పెద్దపల్లి: రౌద్రం కవితా పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ప్రముఖ విద్యావేత్త ఏసుదాసు సభాధ్యక్షతన జరగగా స్థానిక ప్రెస్ క్లబ్ లో పలువురు ప్రముఖులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఉత్తర తెలంగాణ కవిత్వం తెలంగాణ యాస భాషల సాహిత్యంతో ముడి పడి ఉందన్నారు. ప్రొఫెసర్ ఏకు తిరుపతి  రచించిన  రౌద్రం పుస్తకాన్ని ఆవిష్కరించడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ నతనియల్, ప్రధానోపాధ్యా యులు ఏసుదాసు, జింక మల్లేశం, రాజయ్య, ప్రముఖ ఉద్యమకారుడు పడాల శ్రీనివాస్ గౌడ్,  ప్రముఖ ఉద్యమకారుడు బండ శ్రీనివాస్, మార్వడి సుదర్శన్,   మాల మాదిగ ఉపకులాల ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కర్రె రవీందర్, ఎక్కిరాల రాజు, హరిబాబు, న్యాయవాది శంకర్ పాల్గొన్నా రు. అనంతరం రచయిత, ప్రొఫెసర్ ఏకు తిరుపతి పలువురు అభిమానులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరాక్షరా స్యత, నిరుద్యోగం పేదరికం, ఆర్థిక, అసమానతలు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ప్రజలు ఎదుర్కొంటు న్నారని ఆవేదన చెందారు. ఖనిజ సంపదలను రక్షించుకొనే బాధ్యత ప్రజలపై ఉందన్నారు. మనం ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. సామాజిక సమతుల్యత సాధించాడానికి అందరికీ అభివృద్ధి అవకాశాలను అందించాలనే దృక్పథం తో రౌద్రం రచించినట్లు తెలిపారు.కాలానుగుణంగా సామాజిక మార్పు జరగాలనే సత్యంతో స్నేహపూరిత సహాయాన్ని అందించాల ని కోరుకుంటూ, అందరూ చేయి చేయి కలుపుతూ ఒకరికి ఒకరు వెన్ను తట్టి మానవత్వం తో ఉత్తర తెలంగాణ అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నాన ని కోరారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్