- Advertisement -
మాదాపూర్ లో రేవ్ పార్టీ భగ్నం
Rave party in Madapur broke up
మాదాపూర్ సైబర్ టవర్ సమీపంలో రేవ్ పార్టీ భగ్నమైంది. క్లౌడ్ 9 హోమ్స్ సర్వీస్ అపార్టుమెంటులో రంగారెడ్డి జిల్లా ఎస్టీఎఫ్ పోలీసులు గురువారం రైడ్స్ నిర్వహించారు. 14 మంది యువకులు, ఆరుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. విదేశీ మద్యం, కొకైన్, ఏండిఏంఏ డ్రగ్, 0. 68 గ్రాముల ఒజీకుస్ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. బేగంపేటకు చెందిన నాగరాజు ఈ రేవ్ పార్టీని ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు. విచారణ చేపట్టారు
- Advertisement -