రీ సర్వే రాజకీయం…
హైదరాబాద్, ఫిబ్రవరి 19, (వాయిస్ టుడే )
Re survey politics...
తెలంగాణలో కులగణన తప్పుల తడక అంటూ విపక్షాలు, బీసీ , ఎస్సీ ఎస్టీ సంఘాల నుంచి విమర్శలు రావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం రీ సర్వే చేపట్టింది. తొలిరోజు రీసర్వేకు మంచి స్పందన వచ్చిందన్నారు అధికారులు. ఈనెల 28వరకు రీసర్వే కొనసాగుతుందని.. కులగణనలో వివరాలు నమోదు చేసుకోనివారంతా ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. రెండోసారి సర్వేకోసం మూడంచెల విధానాన్ని అమలు చేస్తున్నారు అధికారులు. ఆన్ లైన్ తో పాటు ఆఫ్ లైన్ లోనూ వివరాలు సేకరిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశారు. ఈ టోల్ ఫ్రీ నెంబర్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని చేస్తుంది తెలిపారు. ఫోన్ చేసిన వారి ఇళ్లకి వెళ్లి ఎన్యుమరేటర్లు వివరాలు నమోదు చేసుకుంటున్నారు. తొలి దశ కులగణనలో పాల్గొననివారు తమ ఆధార్, మొబైల్ నంబర్, అడ్రస్, పోస్టల్ పిన్‌కోడ్ లాంటి వివరాలను కాల్ సెంటర్‌కు అందజేస్తున్నారు. మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సెంటర్స్‌లో వివరాలు నమోదు చేసుకుంటున్నారు. ఆ డీటెయిల్స్ ఆధారంగా సర్వే అధికారులే వారి ఇళ్లకు వెళ్లి వివరాలను సేకరిస్తున్నారు.కులగణనపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏకంగా బీసీ కమిషన్ రంగంలోకి దిగింది. ఛైర్మన్ నిరంజన్ సహా బీసీ కమిషన్ సభ్యులు.. రాపోలు జయప్రకాశ్, సురేందర్ కూడా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. బీసీ కమిషన్ ఛైర్మన్ చాంద్రాయణగుట్ట కుమ్మరివాడి బస్తీలో తిరిగారు. గతంలో సర్వేలో పాల్గొనని వారి ఇంటికెళ్లి.. కులగణనలో తమ పేర్లు నమోదు చేయించుకోవాలని అవగాహన కల్పించారు.గతంలో నిర్వహించిన సర్వేలో మొత్తం కోటి 15లక్షల కుటుంబాలకు గాను కోటి 12 లక్షల కుటుంబాలు సర్వేలో పాల్గొన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్ఈలో వెల్లడించింది. కులగణనలో పాల్గనని 3లక్షల 56వేల మంది కోసం రెండోసారి సర్వేకు అవకాశం కల్పించింది.
కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..
రేవంత్ రెడ్డి ప్రధాని మోదీ కులంపై చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. రాహుల్ గాంధీ కులము, మతము జాతి లేనివారంటూ వ్యాఖ్యానించారు. రాహుల్ తల్లి సోనియాగాంధీ క్రిస్టియన్ అని, రాహుల్ గాంధీ తాత ఫిరోజ్‌ఖాన్ గాంధీ.. రాజీవ్ గాంధీ తండ్రి ముస్లిం అయితే రాహుల్ గాంధీ కూడా ముస్లిం అవుతారన్నారు. కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి కామెంట్లకు సంజయ్ కౌంటర్ ఇస్తూ.. తెలంగాణ రాష్ట్రంలో కులం, మతం మీద చర్చ జరుగుతుండటం దురదృష్టకరమన్నారు. 1994లో మోదీ కులాన్ని బిసీగా మార్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. తండ్రి కులమే కొడుకుకు వస్తుందంటున్న కాంగ్రెస్ వాళ్లు సమాధానం చెప్పాలని.. నరేంద్ర మోదీ పక్కా ఇండియన్ అంటూ పేర్కొన్నారు. 10 శాతం ముస్లింలను బిసీలుగా మార్చారు. బీసీలకు ఇచ్చేది 32 శాతమే. 42 శాతం ఎలా అవుతుందన్నారు. లవ్ జిహాదీ, మత మార్పిడిలకు వ్యతిరేకంగా మహారాష్ట్ర తరహాలో తెలంగాణలోనూ చట్టం రావాలన్నారు. హిందూ బీసీలకు 42శాతం ఇస్తే కేంద్రం సహకరిస్తుందంటూ బండి సంజయ్ పేర్కొన్నారు.బీసీలకు రిజర్వేషన్ కల్పించాలన్న చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ చేసిన కులగణనను ఒక్క కులసంఘం కూడా ఆమోదించలేదని విమర్శించారు..కాంగ్రెస్ ప్రభుత్వం రెండోసారి కులగణన కూడా చిత్తశుద్ధితో చేయడం లేదంటున్నారు బీఆర్ఎస్ నేతలు. బీసీలకు న్యాయం చేయాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి కనిపించడం లేదని ఆరోపించారు..ఇక ఈ రీ సర్వేతోనైనా కులాల లెక్క తేలుతుందా? స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పిస్తారా అని కులసంఘాలు ప్రశ్నిస్తున్నాయి.