Monday, December 23, 2024

నిజమైన బలం ఓటు… సోషల్ మీడియా కాదు…

- Advertisement -
real-strength-is-voting-not-social-media
real-strength-is-voting-not-social-media

సోషల్ మీడియాలో  హై ఓల్టేజ్

తమకు ఆదరణ పెరిగిందంటున్నకాంగ్రెస్

న్యూఢిల్లీ, ఆగస్టు9, వాయిస్ టుడే:  భారత ప్రధాని నరేంద్ర మోదీ కంటే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకే సోషల్ మీడియాలో ఎక్కువ ఆదరణ లభిస్తోందని హస్తం పార్టీ అంటోంది. ఈ నేపథ్యలోనే యూట్యూబ్‌లో ప్రధాని మోదీ వీడియోల కంటే రాహుల్ గాంధీ వీడియోలనే ప్రజలు ఎక్కువగా వీక్షిస్తున్నారంటూ కాంగ్రెస్ ఉదాహరిస్తోంది. అయితే అటు రాజకీయాలు అయినా, సోషల్ మీడియా అయినా ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ ఏ విధమైన పోటీ కాదని.. రాహుల్‌ని ప్రధానితో పోల్చకుండా ముందుకు సాగితేనే కాంగ్రెస్ మరింత మెరుగ్గా ఉంటుందన్న వాదన కూడా లేకపోలేదు. ట్విట్టర్, ఫేస్‌బుక్, యూట్యూబ్‌లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన ప్రధాని మోదీ ప్రపంచ నాయకుడిగా మారిపోయారని, అగ్రదేశాల్లోని పాలకులే మోదీకి ఫాలోవర్లంటూ నివేదికలు చెబుతున్నాయి.

ట్విట్టర్‌నే ఉదాహరణగా తీసుకుంటే ప్రధాని మోదీకి 9.8 కోట్ల మంది ఫాలోవర్లు, ప్రపంచదేశాల్లో అగ్రదేశంగా పేరుపొందిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కి కేవలం 3.7 కోట్ల మంది ఫాలోవర్లు మాత్రమే అని లెక్కలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ప్రధాని మోదీ తర్వాత అత్యధికంగా ట్విట్టర్ ఫాలోవర్లు కలిగిన రాజకీయ నేతగా తర్వాతి స్థానాల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(3.3 కోట్లు), ఆమ్‌ఆద్మీ పార్టీ అధినేత-ఢిల్లీ సీఏం అరవింద్ కేజ్రీవాల్(2.7 కోట్లు), యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్(2.5 కోట్లు) ఉన్నారు. వీరందరి తర్వాత రాహుల్ గాంధీ 2.4 కోట్ల మంది ఫాలోవర్లతో ఐదో స్థానంలో నిలిచారు.ఇదే ప్రమాణికంగా తీసుకుంటే ప్రధాని మోదీకి, రాహుల్ గాంధీకి మధ్య ఉన్న తేడా ఒక్క ట్విట్టర్‌లోనే 7.4 కోట్ల మంది ఫాలోవర్లు. ఇక కాంగ్రెస్ ఉదాహరణగా చెబుతున్న యూట్యూబ్ విషయానికి వస్తే.. ప్రధాని మోదీకి 1.6 కోట్ల మంది ఫాలోవర్లు, రాహుల్ గాంధీకి 26 లక్షల మంది ఫాలోవర్లు.

అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రధాని మోదీకి 7.7 కోట్ల మంది, రాహుల్‌కి 40 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఫేస్‌బుక్‌లో ప్రధాని మోదీకి 4.8 కోట్ల మంది ఫాలోవర్లు ఉండగా, రాహుల్‌కి 66 లక్షల మంది ఫాలోవర్లు మాత్రమే ఉన్నారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ కంటే రాహుల్ గాంధీకి ఆదరణ పెరుగుతోందని కాంగ్రెస్ అనుకోవడం హాస్యాస్పదంగా ఉందంటూ సోషల్ మీడియాలో లెక్కలు చెబుతున్నాయని అధికార బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. సోషల్ మీడియాలో రాహుల్ గాంధీకి, ప్రధాని మోదీకి ఉన్న పాపులారిటీ తేడా స్పష్టంగా కనిపిస్తోంది. వారివారి పోస్ట్‌లకు లభించే ఆదరణ విషయంలోనూ అదే పరిస్థితి. అయితే ఈ వాస్తవాలకు విరుద్ధంగా యూట్యూబ్‌లో ప్రధాని మోదీ కంటే రాహుల్‌కే ఎక్కువ ఆదరణ లభిస్తోందని కాంగ్రెస్ సోషల్ మీడియా బృందం నమ్ముతోంది.

యూట్యూబ్‌లో మోదీ వీడియోలకు సగటున 56,000 వీక్షణలు రాగా, రాహుల్ వీడియోలకు సగటున 3.43 లక్షల వీక్షణలు వచ్చాయని ఓ నేషనల్ న్యూస్‌పేపర్ ప్రచురించిన కథనం కూడా పేర్కొంది.ప్రజలకు కనిపిస్తున్న వాస్తవిక లెక్కల ప్రకారం ప్రధాని మోదీకి మొత్తం 3 బిలియన్ల వీక్షణలు లభించగా, రాహుల్ గాంధీకి కేవలం 400 మిలియన్ల వీక్షణలు వచ్చాయి. రాహుల్ గాంధీ వీడియోలను యూట్యూబ్‌లో 25 కోట్ల మంది వీక్షించగా, ఈ ఒక్క ఏడాదే ప్రధాని మోదీ వీడియోలకు 76 కోట్ల యూట్యూబ్ వీక్షణలు వచ్చాయి. ఈ లెక్కలే ప్రధాని మోదీకి ప్రజల్లో ఉన్న ఆదరణకు నిదర్శనమని బీజేపీ ధీమాగా చెప్పుకొస్తోంది. ఎన్నికల్లో ఓడిపోతామని తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ ఈవీఎం మాయ అంటూ దుష్ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తుంటే సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాయంటూ హస్తం పార్టీ ఆరోపిస్తోంది. రాహుల్ గాంధీ వీడియోలపై ‘అల్గారిథమిక్‌గా అణచివేత’, యూజర్ ఎంగేజ్‌మెంట్‌ ఉన్నా వీక్షణలను పొందలేదని ఆరోపిస్తూ కాంగ్రెస్ 2023 మార్చీలో YouTube సంస్థకు లేఖ రాసింది.ఇదిలా ఉండగా.. తమ పార్టీ ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో ఇతరుల కంటే ముందుందని, 2014 సాధారణ ఎన్నికలకు ముందే ఇంటర్నెట్ ప్రాముఖ్యతను గుర్తించిన మొదటి పార్టీ తమదేనంటూ అధికార బీజేపీ అంటోంది. 2014లో మెయిన్‌లైన్ మీడియా ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్, రాహుల్ గాంధీని అడ్డుకోవడంలో బీజేపీ సోషల్ మీడియాను సమర్ధవంతంగా ఉపయోగించిదని ఆ పార్టీ పేర్కొంటోంది.

వాస్తవానికి బీజేపీ ఇప్పుడూ అదే చేస్తోంది. ప్రజలకు చేరువ కాగలిగేవారి ద్వారా తమ నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్తోంది. ఈ క్రమంలో ప్రతి జిల్లా నుంచి స్థానికంగా ఫేమస్ అయిన సోషల్ మీడియా ఇన్ఫ్లూయేన్సర్లను డిజిటల్ ఆర్మీ కోసం వినియోగించుకోవాలని కూడా బీజేపీ యోచిస్తోంది.కాగా, రాజకీయాల్లో ఏ నాయకుడికి అయినా నిజమైన బలం అతను సంపాదించే ఓటు. సోషల్ మీడియా ఆదరణపై ప్రధాని మోదీని, రాహుల్‌గాంధీని పోల్చే విషయంలో ఎలాంటి వివాదం లేదు. కానీ కాంగ్రెస్‌కి తెలియని కఠోర వాస్తవం ఏమిటంటే.. ఎన్నికలు అయినా, సోషల్ మీడియా అయినా, వేదిక ఏదైనా ప్రధాని మోదీకి పోటీ లేదంటూ బీజేపీ చెప్పుకోస్తోంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్