“ఫౌజీ” సినిమా స్టిల్ ను ఇన్ స్టా డీపీగా మార్చుకున్న రెబల్ స్టార్ ప్రభాస్

- Advertisement -

“ఫౌజీ” సినిమా స్టిల్ ను ఇన్ స్టా డీపీగా మార్చుకున్న రెబల్ స్టార్ ప్రభాస్

Rebel Star Prabhas changes his Instagram DP to a still from the movie ‘Fauji’.
అలుపులేకుండా భారీ పాన్ ఇండియా చిత్రాలు చేసుకుంటూ తన అభిమానులను, ప్రేక్షకులను సంతోషపెట్టే రెబల్ స్టార్ ప్రభాస్ సోషల్ మీడియాలో తరుచూ అప్డేట్స్ ఇవ్వరు. అలాంటి ప్రభాస్ తన ఇన్ స్టా పేజీ డీపీ మార్చారంటే అది క్రేజీ న్యూస్ గా మారిపోవడం సహజమే. దాదాపు ఏడేళ్ల తర్వాత ప్రభాస్ తన ఇన్ స్టాగ్రామ్ పేజీ డిస్ ప్లే పిక్చర్ మార్చారు. తన కొత్త సినిమా “ఫౌజీ” స్టిల్ తో ప్రభాస్ ఇన్ స్టా డీపీ పెట్టుకున్నారు. ఇండిపెండెన్స్ డే కు ఒకరోజు ముందు ప్రభాస్ తన డీపీ మార్చడం వైరల్ గా మారింది.
వరల్డ్ వైడ్ సినీ ప్రియులకు “ఫౌజీ” మోస్ట్ అవేటెడ్ మూవీగా మారింది. ఈ సినిమా విజయంపై ప్రభాస్ పూర్తి నమ్మకంతో ఉన్నారు, అదే కాన్ఫిడెన్స్ తో మూవీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. గ్రాండ్ పీరియాడిక్ యాక్షన్ మూవీని “ఫౌజీ”లో ప్రేక్షకులు చూడబోతున్నారు.
టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో దర్శకుడు హను రాఘవపూడి రూపొందిస్తున్న ఫౌజీ చిత్రంలో ఇమాన్వీ హీరోయిన్ గా నటిస్తోంది. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద, చైత్ర జె. అచార్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకు సుదీప్ ఛటర్జీ డీవోపీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular