- Advertisement -
మీ వాహనాల ఫాస్ట్ ట్యాగ్లను ముందే రీఛార్జ్ చేయించండి
Recharge your vehicle fast tags in advance
రాచకొండ
రానున్న సంక్రాంతి పండుగ సందర్భంగా సొంత ఊర్లకు వెళ్లే ప్రయాణికులకు చౌటుప్పల్ పరిధిలోని పంతంగి, బీబీనగర్ టోల్గేట్ వద్ద వాహనాల అధిక రద్దీమూలంగా వేచి ఉండడం వల్ల ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల ప్రయాణికులకు సమయం వృధా కావడంతో పాటు అనవసర అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. అందువల్ల వాహదారులు టోల్గేట్ వద్ద అధిక సమయం వెచ్చించకుండా ఉండేందుకు ముందస్తుగానే తమ వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్లను రీఛార్జి చేయించుకోవాల్సిందిగా రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు సూచించారు. దీనివల్ల తమ గమ్యస్థానాలకు త్వరగా చేరుకునే అవకాశం ఉంది.
- Advertisement -