హైదరాబాద్ నవంబర్ 1: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ జిల్లా శాఖ మేనేజింగ్ కమిటీ సభ్యులు పి వీరమణి ఆధ్వర్యంలో 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు వికలాంగులకు మరియు ట్రాంజెండర్ లకు మొబైల్ మెడికేర్ యూనిట్ లో భాగంగా చార్మినార్, పెట్లబుర్జీ, ఏ. పీ ఎం. డబ్ల్యూ. ఎస్ నైట్ షెల్టర్ లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ జిల్లా శాఖ చైర్మన్ మామిడి భీమ్ రెడ్డి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. రవి హీలియస్ హాస్పిటల్ ఎండి డాక్టర్ బి. విజయభాస్కర్ గౌడ్ వృద్ధులకు వైద్య పరీక్ష నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా శాఖ హెల్త్ కన్వీనర్ డాక్టర్ బి శ్రీదేవి, హైదరాబాద్ డివిజనల్ కన్వీనర్ ధర్మతేజ, హైదరాబాద్ జిల్లా శాఖ ప్యాట్రన్ సభ్యులు సుప్రభా, డా. హరిప్రియ, సువర్ణ, స్వర్ణ, స్టాఫ్ నర్స్ లావణ్య, మహేష్, ఏపీ లక్ష్మి, వెంకట్ ,మురళి గోపాల్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.