కాసులు కురిపిస్తున్న ఎర్ర బంగారం
గుంటూరు, మార్చి 24(వాయిస్ టుడే )
Red Gold Raining Down Riches
తెలుగు రాష్ట్రాల్లో పండించే మిరప పంటకు ప్రపంచ స్థాయిలో గిరాకీ ఎక్కువే. నాణ్యతతోపాటు మంచి రంగు, రుచి, ఘాటు వీటికి ఉంటుంది. అయితే మిరప రైతులకు గిట్టుబాటు ధర దొరక్క యేటా అప్పుల ఊబిలో కూరుకుపోయి నష్టాలు చూసేవారు. దీంతో నష్టాల బాధలు భరించలేక చాలా మంది రైతులు మిరపను సాగుచేయలేమంటూ చేతులెత్తేశారు. ఇక మరికొంతమంది రైతులు చేస్తున్న సాగు విస్తీర్ణంను తగ్గించుని కొద్ది మొత్తంలో మాత్రమే మిరప పంటను పండిస్తున్నారు. అయితే ఈ ఏడాది మాత్రం మిరప పంట రైతులకు కనీవినని రీతిలో కాసులు కురిపించనున్నాయి. అందుకు కారణం మార్కెట్లో మన ఎర్రబంగారానికి ధరలు ఆశాజనకంగా ఉండటమే.ముఖ్యంగా ఏపీలో జనవరి నుంచి మిర్చి ధరల్లో క్రమ క్రమంగా పెరుగుదల కనిపించింది. క్వింటాలుకు సగటున రూ.20 వేల వరకు ధర లభిస్తోంది. జనవరి నుంచి ఇప్పటి వరకు సగటున క్వింటాలుకు రూ.5 వేలకు పైగానే ధర పెరిగింది. మిర్చికి డిమాండ్ పెరగడంతో వ్యాపారులు నేరుగా గ్రామాలకు చేరుకుని మధ్యవర్తుల జోక్యం లేకుండానే రైతుల వద్ద నుంచి పంట కొనుగోలు చేస్తున్నారు. దీంతో గత నాలుగైదేళ్లుగా నష్టాలను చూసిన మిర్చి రైతులకు తాజా ధరలు ఉపశమనం అందించాయి. మార్కెట్లో మంచి ధర పలకడంతో ప్రస్తుతం శీతల గోదాముల్లో నిల్వ చేసిన సరకు కొద్ది కొద్దిగా తగ్గడం మొదలైంది. ఇక గుంటూరు మార్కెట్ యార్డుకు గత వారంలో 1.29 లక్షల బస్తాల మిరప రాగా.. ఇందులో ఏకంగా 1.26 లక్షల బస్తాల వరకు అమ్ముడయ్యాయి. అయితే మిర్చి సాగు ఈసారి ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాదు.. కర్ణాటక, తెలంగాణ, గుజరాత్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో సైతం తగ్గింది.ఉత్పత్తి తగ్గడంతో డిమాండ్ పెరిగినట్లైంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ అధికంగా ఉండటంతో జనవరి నెల నుంచే ధరల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. గతేడాది క్వింటాల్ మిర్చీ కేవలం రూ. 10 వేలలోపు మాత్రమే పలికింది. ఈ సారి రూ.20 వేలకు పైగానే ధర పలుకుతోంది. తేజ మిర్చి ధర జనవరి, ఫిబ్రవరిలో రూ.15 వేలు ఉంటే ప్రస్తుతం ఏకంగా రూ.19,500కు చేరుకుంది. తాలు రకం కూడా క్వింటాలు ధర రూ.10 వేలకు పైగానే పలుకుతుంది. ఇలా జనవరి నెల నుంచే అన్ని రకాల మిర్చీకి ధరల్లో ఘననీయమైన పెరుగుదల కనిపించింది. పంటలు 50 శాతం తగ్గడం, గోదాముల్లో మిర్చీ నిల్వలు తక్కువగా ఉండటంతో వ్యాపారులు పోటీపడి మరీ పంటను కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్లో ధరలు ఊపందుకోవడంతో రైతులు మిర్చి పంట కోతలు కోసిన వెంటనే త్వరితగతిన ఆరబెట్టి మార్కెట్కు తరలిస్తున్నారు. అన్ని ఖర్చులూ కలుపుకుని ఎకరాకు రూ.4 లక్షల వరకు పంట ఉత్పత్తి వ్యయం అవుతోంది. ఎకరానికి 25 క్వింటాళ్ల దిగుబడి వస్తే సగటున క్వింటాలుకు రూ.18 వేలు వేసిన పాతిక క్వింటాళ్లకు రూ. 4.50 లక్షల వరకు చేతికొచ్చే అవకాశం ఉంది.
రైతులకు ఆనందం
వరుసగా నష్టాలు రావడంతో ఇక సాగు చేయడం తమ వల్ల కాదంటూ కొందరు మిరప సాగు చేయలేదు. ఇది కాస్త కలిసి వచ్చింది. జనవరి ప్రారంభం వరకు నామమాత్రం ధరలు ఉన్నా.. కొత్త సంవత్సరం నుంచి మిరప ధరలు పైపైకి చేరాయి. ప్రస్తుతం క్వింటాల్ మిరపకు సగటున రూ.20 వేల ధర పలుకుతోంది. జనవరికి నేటికి ధరను పోలిస్తే.. సుమారు 5 వేల రూపాయల వరకు పెరిగింది. ప్రస్తుతం మిరపకు డిమాండ్ బాగా ఉండటంతో.. వ్యాపారులు గ్రామాలకు వెళ్లి నేరుగా రైతుల వద్ద నుంచి మిరప కొనుగోలు చేస్తున్నారు. తాజా పరిణామంతో గత ఐదేళ్లుగా మిరప సాగుతో నష్టాలు చవి చూసిన రైతులు ఈసారి లాభాలను కళ్ల చూస్తున్నారు.మిర్చికి ప్రస్తుతం ఎంత డిమాండ్ ఉందంటే.. గత మంగళవారం గుంటూరు మార్కెట్ యార్డుకు 1.29 లక్షల బస్తాల మిర్చి రాగా, 1.26 లక్షల బస్తాలు అమ్ముడుపోయాయి. దీన్ని బట్టి మిర్చికి డిమాండ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సంవత్సరం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా మిరప సాగు తగ్గిపోయింది. అటు అంతర్జాతీయ మార్కెట్ లో మిర్చికి మంచి డిమాండ్ ఉండటంతో.. ఈ సంవత్సరం జనవరి నుంచి మిర్చి ధర క్రమంగా పెరుగుతూ వస్తోంది. గతేడాది ఇదే సమయానికి రూ.10 వేలకు అమ్ముడుపోయిన మిర్చికి ఇప్పుడు రూ.20 వేల ధర పలుకుతోంది.సన్న రకాలకు డిమాండ్ బాగా పెరిగింది. దీంతో ఈ సంవత్సరం జనవరి, ఫిబ్రవరిలో రూ.15 వేలు ఉన్న తేజ మిర్చి క్వింటాల్ ధర ప్రస్తుతం రూ.19,500కు చేరింది. తాలు ధరలు క్వింటాలుకు రూ.10 వేలకు పైనే ఉన్నాయి. ధరలు ఆశాజనకంగా ఉండటంతో రైతులు మిరప కోసిన వెంటనే ఆరబెట్టి అమ్మేస్తున్నారు.ఇదిలా ఉంటే ఈ సంవత్సరం మిరప సాగుకు పెట్టుబడులు భారీగా పెరిగాయి. అన్ని ఖర్చులూ కలిపి ఎకరాకు రూ.4 లక్షల వరకు ఖర్చు అవుతుందంటున్నారు అన్నదాతలు. ఎకరాకు 25 క్వింటాళ్ల దిగుబడి వస్తే.. సగటున క్వింటాలుకు రూ.18 వేల ధర లభిస్తే.. అప్పుడు రూ.4.50 లక్షల వరకు చేతికొస్తోందని తెలిపారు.



