Friday, December 27, 2024

తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గించండి-

- Advertisement -

తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గించండి

Reduce the VIP culture in Tirumala

తిరుమల, అక్టోబరు 5, (వాయిస్ టుడే)
తిరుమలలో వీఐపీ సంస్కతి తగ్గాలని సీఎం చంద్రబాబు టీటీడీని అదేశించారు. ప్రముఖులు వచ్చినప్పుడు హడావుడి కనిపించకూడదన్నారు. సింపుల్‌గా, ఆధ్యాత్మిక ఉట్టిపడే పరిసరాలు ఉండాలి తప్ప ఆర్భాటం, అనవసర వ్యయం వద్దని సూచించారు. తిరమలలోని పద్మావతి అతిథి గృహంలో టీటీడీ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి, టీటీడీ ఈవో శ్యామల రావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి సహా ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.ఈ సమీక్షలో టీటీడీ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు పలు సూచనలు చేశారు. తిరుమల పవిత్రత, నమ్మకం కాపాడేలా ప్రతి ఒక్కరూ పని చేయాలని ;చంద్రబాబు  హితవు పలికారు. కొండపై గోవింద నామస్మరణ తప్ప మరో మాట వినిపించకూడదని గట్టిగా చెప్పారు. ప్రశాతంతకు ఎక్కడా భంగం కలగకూడదన్న చంద్రబాబు.. ఏ విషయంలో కూడా రాజీ పడొద్దని ఆదేశించారు. ఈ మధ్య కాలంలో జరిగిన రాజకీయ హడావుడిని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు ఈ సూచన చేసినట్టు కనిపిస్తోంది.  భవిష్యత్ నీటి అవసరాలకు తగ్గట్లు నీటి లభ్యత ఉండేలా చూసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులను అప్రమత్తం చేశారు చంద్రబాబు. ముందస్తు ప్రణాళికు సిద్ధం చేయాలన్నారు. అటవీ ప్రాంతాన్ని 72 నుంచి 80 శాతంపైగా పెంచాలని అధికారులకు సూచించారు అటవీ సంరక్షణతోపాటు అడవుల విస్తరణ కోసం వచ్చే 5 ఏళ్లకు ప్రణాళికు రూపొందించాలన్నారు. బయోడైవర్సీటీ పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. టీటీడీ సేవలపై భక్తుల నుంచి స్పందన తీసుకునే విధానంపై సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. వచ్చిన ప్రతి భక్తుడు తమ అనుభవాలపై అభిప్రాయాలు చెప్పే అవకాశం కల్పించాలన్నారు. భక్తుల సూచనలు, సలహాల ఆధారంగా సేవలపై టీటీడీ పనిచేయాలని అప్‌డేట్ చేస్తూ ఉండాలని సూచించారు. ఒక్క టీటీడీలోనే కాకుండా అన్ని దేవాలయాల్లో భక్తుల అభిప్రాయాలు తీసుకునే విధానం తీసుకురావాలని మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డిని ఆదేశించారు. లడ్డూ ప్రసాదం, అన్న ప్రసాదం నాణ్యత పెరిగిందని భక్తులు చెబుతున్నారన్న చంద్రబాబు…ఎల్లప్పుడూఇది కొనసాగాలని ఆదేశించారు. మరింత మెరుగుపడేలా చూడాలన్నారు. ప్రసాదాల తయారీలో వాడే పదార్థాల నాణ్యత బాగుండేలా చూడాలన్నారు. అత్యుత్తమ పదార్థాలు మాత్రమే వాడాలని సూచించారు. టీటీడీ సిబ్బంది భక్తుల పట్ల గౌరవంగా వ్యవహరించాలన్న సీఎం… దేశ విదేశాల నుంచి వచ్చేవారు హ్యాపీగా వెళ్లేలా చూడాలన్నారు. దురుసు ప్రవర్తన అనేది ఎక్కడా ఉండకూడదని హెచ్చరించారు. భక్తులు సంతృప్తితో, అనుభూతితో కొండ నుంచి తిరిగి వెళ్లాలని హితవు పలికారు. తిరుమల పేరు తలిస్తే ఏడుకొండల వాడి వైభవం, ఆధ్యాత్మిక మాత్రమే చర్చకు రావాలన్నారు.స్విమ్స్ సేవలు కూడా మెరుగుపరచాలన్నారు చంద్రబాబు. ఇదొక ప్రత్యేకమైన క్షేత్రమని…  తిరుమల పవిత్రత కాపాడడం, ఆధ్యాత్మిక విషయంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ఈ సమీక్ష అనంతరం తిరుమలలో వకుళమాత సెంట్రలైజ్డ్ కిచెన్ ను ముఖ్యమంత్రి ప్రారంభించారు.  అనంతరం అక్కడ కూడా అధికారులకు పలు సూచనలు చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్