55 మార్కులకు తగ్గించండి…
సింగరేణి ఉద్యోగాలు ఇప్పించండి.
మంత్రి శ్రీధర్ బాబును వేడుకున్న మైనింగ్ గ్రాడ్యుయేట్స్.
కమాన్ పూర్
సింగరేణి జాబ్ ఎక్స్టర్నల్ నోటిఫికేషన్ లో మార్కుల శాతం 55% కు తగ్గించాలి అని మంత్రి శ్రీధర్ బాబు కు మైనింగ్ గ్రాడ్యుయేట్స్ వినతి పత్రం సమర్పించారు.
బీటెక్ మైనింగ్ పూర్తి చేసి ఎన్నో రోజులుగా మైనింగ్ గ్రాడ్యుయేట్ ట్రైనీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న మాకు మా అందరి గురించి ఆలోచించి సింగరేణి సంస్థ ద్వారా ఖాళీలను భర్తీ చేయుటకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది కానీ ఇటువల ఇచ్చిన నోటిఫికేషన్ నం .01/2024 లో మార్కుల శాతం 60% నిబంధన ఉండడం వల్ల మేము తీవ్రంగా నష్టపోతున్నాము .గతంలో సింగరేణిలో ఇచ్చిన నోటిఫికేషన్ 2010 సంవత్సరంలో నోటిఫికేషన్ నెంబర్ 4/2010, 2017లో ఇచ్చిన నోటిఫికేషన్ నెంబర్ 1/2017 సంవత్సరంలో ఇచ్చిన నోటిఫికేషన్ 5/ 2017 ద్వారా చేపట్టిన నియమకాల నోటిఫికేషన్లు 55 శాతం మార్కుల నిబంధన పెట్టడం జరిగింది. కానీ ఇప్పుడు ఎన్నో రోజులు ఎదురు చూస్తున్న మాకు గతంలో లాగా 55% మార్కుల నిబంధన కాకుండా 60% పెట్టడం వల్ల దాదాపు 250 మంది 2018 నుండి ఎదురుచూస్తూ సింగరేణిలోనే అన్ పేడ్ అప్రెంటిషిప్ ద్వారా బొగ్గు గనులలో పని చేస్తున్న మేము అవకాశాన్ని కోల్పోతున్నాం. కావున మా యందు దయతలచి సింగరేణి సి అండ్ ఎండి బలరాం తో మాట్లాడి గతంలో ఇచ్చిన విధంగా మార్కుల నిబంధనను 55% కు మార్చి పరీక్ష రాయడానికి అవకాశం కల్పించాలని, రాష్ట్ర ఐటి మరియు పరిశ్రమల శాఖ, అసెంబ్లీ వ్యవహారాలు మంత్రి వర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిని కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది. సమస్య విని సానుకూలంగా స్పందించిన మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో
ఏ ప్రదీప్, ఎం గణేష్ ,ఎస్ శ్రీకాంత్, డి రమేష్ ,యు ప్రశాంత్, టీ. మహేందర్,
సిచ్.సాయి సుష్మత్, ఎం ప్రవీణ్ , జే.సుధాకర్ మరియు మాలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు వారందరి తరుపున మాకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాము.