- Advertisement -
కాగితాల్లోనే తగ్గిన మద్యం ధరలు
Reduced prices of alcohol on paper
ఒంగోలు, డిసెంబర్ 27, (వాయిస్ టుడే)
ఆంధ్రప్రదేశ్ మద్యం విక్రయాల్లో ఎక్సైజ్ శాఖ వ్యవహరిస్తున్న తీరుతో ప్రభుత్వానికి విమర్శలు తప్పడం లేదు. మద్యం ధరల్ని తగ్గించాలని, ప్రజలపై భారం తగ్గించాలని ముఖ్యమంత్రి స్థాయిలో భావిస్తున్నా అధికారుల నిర్వాకంతో విమర్శలు తప్పడం లేదు. దీంతో ధరల తగ్గింపు కాగితాలకు పరిమితమవుతోంది.ఆంధ్రప్రదేశ్ లో మధ్య శ్రేణి మద్యం బ్రాండ్ల ధరలు తగ్గిస్తున్నట్టు వారం రోజుల క్రితం లీకులు వచ్చినా దుకాణాలకు మాత్రం స్టాకు చేరలేదు. ఏపీలో గత అక్టోబర్ 16 నుంచి ప్రైవేట్ మద్యం దుకాణాలు ఏర్పాటయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం ధరల్ని తగ్గిస్తామని ప్రకటించినా ఆచరణలో మాత్రం అమలు కాలేదు. ప్రభుత్వ మద్యం దుకాణాల స్థానంలో ప్రైవేట్ మద్యం దుకాణాలు మాత్రమే ఏర్పాటయ్యాయి. లిక్కర్ వ్యాపారం మొత్తం రాజకీయ నేతల కనుసన్నల్లోనే సాగుతుందనే విమర్శలు వచ్చాయి.ఏపీలో మద్యం ధరలపై పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో ముఖ్యమంత్రి ఎక్సైజ్ సమీక్షల్లో చర్యలు చేపట్టాలని పొరుగు రాష్ట్రాలకు తగ్గట్టుగా ధరలు తగ్గించాలని సూచించారు. ఈ నేపథ్యంలో గత నెలలో మూడు బ్రాండ్ల ధరలు తగ్గించారు. తాజాగా క్వార్టర్ రూ.200కు పైబడిన మద్యం బ్రాండ్ల ధరలు తగ్గించాలని నిర్ణయించారు. వీటిలో బ్రాందీ, విస్కీ, రమ్, వొడ్కా వంటి మద్యం రకాలున్నాయి. అయితే కొత్త ధరల గురించి దుకాణాలకు ఇంత వరకు సమాచారం లేదని తెలుస్తోంది. ధరలు తగ్గిన బ్రాండ్లలో మాన్షన్ హౌస్ ఒకటి. ఏపీలో ప్రముఖ సినీనటుడి అభిమాన బ్రాండుగా దీనికి గుర్తింపు ఉంది. 2019లో టీడీపీ ప్రభుత్వం గద్దె దిగే సమయానికి మాన్షన్ హౌస్ క్వార్టర్ రూ.110 ఉన్న మద్యాన్ని వైసీపీ హయంలో ఓ దశలో రూ.300కు విక్రయించారు. పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ధరలు తగ్గించి చివరకు రూ.220కు ఫిక్స్ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా అవే ధరలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మాన్షన్ హౌస్ బ్రాందీ క్వార్టర్ ధర రూ.220 నుంచి రూ.190కి తగ్గింది. అదే బ్రాండ్ హాఫ్ బాటిల్ ధర రూ.440 నుంచి రూ.380కి, ఫుల్ బాటిల్ ధర రూ.870 నుంచి రూ.760కి తగ్గించారు. 2019 జూన్ నాటికి మాన్షన్ హౌస్ 760 ఎంఎల్ బాటిల్ రూ.430 ఉండేది. వన్ లీటర్ బాటిల్ రూ.490కు విక్రయించేవారు.రాయల్ చాలెంజ్ సెలెక్ట్ గోల్డ్ విస్కీ క్వార్టర్ ధర రూ.230 నుంచి రూ.210కి తగ్గింది. ఇదే బ్రాండ్ ఫుల్ బాటిల్ ధర రూ.920 నుంచి రూ.840కి తగ్గించారు. యాంటిక్విటీ బ్లూ విస్కీ ఫుల్ బాటిల్ ధర రూ.1600 నుంచి రూ.1400కు తగ్గింది. ప్రస్తుతం రెండు బ్రాండ్ల ధరలు మాత్రమే తగ్గడం, అవి కూడా పాపులర్ లిక్కర్ బ్రాండ్లు కావడంతో జనంలో అసహనం తప్పడం లేదుక్వార్టర్ రూ.200కు పైబడిన మద్యం బ్రాండ్లలో క్వార్టర్ ఎక్స్‌ఓ బ్రాందీ రూ. 290, మాన్షన్ హౌస్ రూ.220, కొరియర్ నెపోలియన్ గ్రీన్ రూ.300, కొరియర్ నెపోలియన్ ఫ్రెంచ్ బ్రాందీ రూ.230, 8పిఎం విస్కీ రూ.210, స్లెర్లింగ్ రిజర్వ్ బి7 విస్కీ రూ.230, కైరాన్ రేరెస్ట్ రూ.300, రాయల్ గ్రీన్ రూ.220, అరిస్ట్రోక్రాట్ ప్రీమియం రూ.230, మాన్షన్ హౌస్ ఆరెంజ్ రూ.240, బ్రిటిష్ ఎంపైర్ రూ.230, జునో పింక్ వొడ్కా రూ.270, ఆల్ సీజన్ డబుల్ బారెల్ విస్కీ రూ.210గా ఉంది.ఓల్డ్ హ్యాబిట్ విస్కీ క్వార్టర్ రూ. 210, నికోల్స్ గోల్డ్, ప్రీమియం ఫెంచ్ బ్రాందీ రూ.210, రాయల్ ఎన్వీ ఎక్స్‌క్లూజివ్ ప్రీమియం విస్కీ రూ.430, స్టెర్లింగ్ రిజర్వ్ బి10 ఒరిజినల్ విస్కీ రూ.320, న్యూ కింగ్ లూయిజ్ ఫ్రెంచ్ బ్రాందీ రూ.240, సీగ్రామ్ రాయల్ స్టాగ్ క్లాసిక్ విస్కీ రూ.230, సీగ్రామ్ బ్లెండర్స్ ప్రైడ్ ప్రీమియం విస్కీ రూ.360, విఎస్‌ఓపీ డీలక్స్ బ్రాండెట్ విస్కీ రూ.210, ఓల్డ్ మంక్ రమ్ రూ.230, బ్యాగ్ పైపర్ గోల్డ్ విస్కీ రూ.230గా ఉంది.మెలిసా ప్రీమియం విస్కీ క్వార్టర్ రూ.220, ఫ్లోరెన్స్ రేరెస్ట్ రూ.210, జోర్జీస్ ప్రీమియం రూ.250, వైల్ అండ్ బ్లూ విస్కీ రూ.210, హాక్సన్ నోబుల్ రిజర్వ్ రూ.210, గ్రాంటన్ ఎక్స్‌ఓ రూ.200, స్టెర్లింగ్ బి7 ప్రైమ్ విస్కీ రూ.230 ఉన్నాయి.వీటిలో మాన్షన్ హౌస్ బ్రాందీ, రాయల్ ఛాలెంజ్ విస్కీ ధరలు మాత్రమే క్వార్టర్‌పై రూ.30 వరకు తగ్గాయి. మిగిలిన బ్రాండ్ల ధరలు పాతవే కొనసాగుతున్నాయిక్వార్టర్ బాటిల్ రూ.200 దాటిన మద్యం బ్రాండ్ల ధరలు తగ్గుతాయని మద్యం విక్రేతలు చెబుతున్నారు. మద్యం డిస్టిలరీల నుంచి ఏపీ బేవరేజీస్ కార్పొరేషన్‌కు చేరిన మద్యం నిల్వలు సంక్రాంతి పండుగ అమ్మకాలతో పాటు జనవరి నెలాఖరు వరకు సరిపోతాయని చెబుతున్నారు. దీంతో మద్యం తగ్గింపు ధరలు ఇప్పట్లో అమల్లోకి రాకపోవచ్చని చెబుతున్నారు.దాదాపు పది బ్రాండ్ల మద్యం ధరలు తగ్గుతాయని గత వారం రోజులుగా ప్రచారం జరుగుతున్నా దానిపై ఎక్సైజ్ శాఖ ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. మద్యం ధరలు తగ్గిస్తే లాభాలు తగ్గుతాయనే ఉద్దేశంతోనే ఆలస్యం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో మద్యం ధరల్ని సవరించినపుడు తక్షణం అమల్లోకి వచ్చేలా ఉత్తర్వులు జారీచేసేవారు. ఇప్పుడు ధరలు తగ్గుతున్నట్టు లీకులు ఇస్తున్నా క్షేత్ర స్థాయిలో మాత్రం పరిస్థితి బిన్నంగా ఉంది.ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఆర్నెల్లు దాటింది. మద్యం ధరల తగ్గింపు మాటటుంచితే ప్రైవేట్ దుకాణాల ఏర్పాటుతో ప్రభుత్వ ఆదాయం కూడా కోల్పోయిందనే విమర్శలు ఉన్నాయి. మద్యం ధరలపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. త్వరలో ఈ కమిటీ అన్ని బ్రాండ్ల కంపెనీలతో చర్చించి ధరల సవరణపై సిఫారసు చేయనుంది. అందుకు అనుగుణంగా కొత్త ధరలు అమల్లోకి వస్తాయి. కమిటీ నిర్ణయించక ముందే కొన్ని బ్రాండ్లు రేట్లు తగ్గించుకుంటున్నాయి. మరో రెండు ప్రముఖ బ్రాండ్ల మద్యం ధరలు రెండు మూడు రోజుల్లో ధరలు తగ్గించనున్నాయి.హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో మద్యం ధరల సవరణ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ కమిటీ అన్ని కంపెనీలతో ధరల సవరణపై చర్చలు జరపనుంది. బాటిల్ తయారీకి ఎంత ఖర్చు అవుతుంది? ప్రభుత్వానికి వచ్చే ఆదాయంతో పాటు ఇతర రాష్ట్రాల్లో విక్రయిస్తున్న ధరలను పరిశీలించనుంది. ఏపీ, తెలంగాణలో విక్రయించే బ్రాండ్ల ధరల్లో భారీ వ్యత్యాసాలుంటే వాటిని ప్రశ్నించే అవకాశం ఉంది. ముందు జాగ్రత్తగా ధరలు తగ్గిస్తున్నాయని చెబుతున్నారు.
- Advertisement -