Wednesday, January 14, 2026

రీష్ వర్సెస్ మెగా ఫ్యాన్స్

- Advertisement -

రీష్ వర్సెస్ మెగా ఫ్యాన్స్
హైదరాబాద్, జూలై 2, (వాయిస్ టుడే)
ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్ ‘ గేమ్ ఛేంజర్ ’ చిత్రంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ‘గేమ్ ఛేంజర్’ డిజాస్టర్ అయిన తర్వాత మాకు ఎవరైనా సాయం చేశారా? రామ్ చరణ్ ఏమైనా సాయం చేశారా? డైరెక్టర్ ఏమైనా సాయం చేశారా? కనీసం కర్టసీ కోసమైనా ఫోన్ చేసి మాట్లాడలేదు అని శిరీష్ చెప్పుకొచ్చారు. అయితే ఆయన వ్యాఖ్యలు మెగా అభిమానులకు కోపం తెప్పించాయి. దీంతో శిరీష్ నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమని హెచ్చరిస్తూ ఓ లేఖ విడుదల చేశారు.‘మెగా అభిమానులుగా ‘గేమ్ ఛేంజర్‌’ సినిమా కోసం మూడేళ్లుగా ఎదురుచూశాం. దానిపై ఎన్నో ఆశలు పెట్టుకుంటే ప్లాప్ అయింది. అసలే మేం ఆ బాధలో ఉంటే మీరు ప్రతిరోజూ ఆ సినిమా గురించి ఏదొకటి మాట్లాడుతూ, హీరోపైనా, సినిమాపైనా విషం చిమ్ముతున్నారు. ప్రతి ప్రెస్‌మీట్‌లో ‘గేమ్ ఛేంజర్’ గురించి పదేపదే మాట్లాడుతూ మాకు మానసిక క్షోభ కలిగిస్తున్నారు. మీకు ఇదే చివరి హెచ్చరిక. రామ్‌చరణ్ గురించి గానీ, ‘గేమ్ ఛేంజర్’ మూవీ గురించి గానీ ఇంకోసారి తప్పుగా మాట్లాడితే మీరు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది’ అంటూ చెర్రీ ఫ్యాన్స్ ఓ లేఖ విడుదల చేశారు. ఇందులో శిరీష్‌కు ఆరు ప్రశ్నలు సంధించారు.
* గేమ్ ఛేంజర్ పోయింది.. హీరో ఏమైనా సాయం చేశాడా?.. నిర్మాత శిరీష్ సంచలన కామెంట్స్
సినిమా అనేది ఒక బిజినెస్. అందులో లాభాలు వస్తుంటాయి, నష్టాలు వస్తుంటాయి. మీ ప్రొడక్షన్ హౌస్‌లో మీరు చేసే సినిమాలన్నీ మీ వల్లే విజయాలు, లాభాలు వచ్చాయని చెప్పుకునే మీరు.. ఓ సినిమా ప్లాప్ అయితే మాత్రం మిగతా వాళ్లపై నింద మోపడం కరెక్ట్ కాదని లేఖలో పేర్కొన్నారు.
మెగా ఫ్యాన్స్ లేఖలో సంధించిన ప్రశ్నలివే..
*  నేనొక్కడినే సమయంలో 14 రీల్స్ సంస్థ హీరో గురించి ఒక్కసారైనా మాట్లాడారా?
* మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో ప్లాప్ వచ్చినప్పుడు ఎవరైనా హీరోల గురించి తప్పుగా మాట్లాడారా?
*‘సైంధవ్’ మూవీ ప్లాప్ అయ్యాక ఆ ప్రొడ్యూసర్.. వెంకటేష్ గురించి ఎందుకు ఒక్కమాట కూడా మాట్లాడలేదు?
* ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకి వెంకటేష్‌కి ఎంతిచ్చారు? రిలీజ్‌కి ముందు ఎంతిస్తామన్నారు?.. హిట్ అయ్యాక ఎక్స్‌టా ఏమైనా ఇచ్చారా?
* డైరెక్టర్ శంకర్ ఉన్నాడని వెళ్లింది ఎవరు?.. సంవత్సరం అని చెప్పి మూడేళ్లు వేస్ట్ చేసింది ఎవరు?
* ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మీతో చేసిన సినిమా హీరో మీద విషం చిమ్మడం కరెక్టేనా?
* గుంటూరు కారంతో 8 కోట్లు నష్టం.. మైత్రి నక్క.. నాగవంశీ నాగలోకం : శిరీష్
ఇలా శిరీష్‌ని టార్గెట్ చేస్తూ మెగా అభిమానులు వరుస ప్రశ్నలతో ఓ లేఖ విడుదల చేశారు. ఇంకోసారి తమ హీరోని టార్గెట్ చేస్తూ ఎవరైనా నోటికొచ్చినట్లు మాట్లాడితే తాము ఊరుకోమని.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని మెగా ఫ్యాన్స్ హెచ్చరించారు. ఈ లేఖ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్