మంథని ఆర్టీసీ డిపో ను సందర్శించిన రీజినల్ మేనేజర్ రాజు

- Advertisement -

మంథని ఆర్టీసీ డిపో ను సందర్శించిన రీజినల్ మేనేజర్ రాజు

Regional Manager Raju who visited Manthani RTC Depot

మంథని

మంథని టీజిఎస్ ఆర్టీసీ డిపోను కరీంనగర్  నూతన రీజనల్ మేనేజర్ బి రాజు  మంగళవారం సందర్శించారు. మంథని డిపో మేనేజర్ వి.శ్రావణ్ కుమార్  ఆర్ఎం రాజు కు పుష్పగుచ్చం అందజేసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులకు  నూతన ఆర్ఎం రాజు దిశా నిర్దేశం చేసి పలు సూచనలు, సలహాలు అందజేశారు. ప్రస్తుతం మహాలక్ష్మి పథకం వలన ఆర్టీసీకి మంచి ఆదాయం వస్తుందని, ఇదేవిధంగా ఉద్యోగులందరు కష్టపడి మహిళలను ఆదరణతో ఆహ్వానించి మంథని డిపోను లాభాల బాటలకు తీసుకొచ్చి ఈ యొక్క డిపో బస్సుల సంఖ్య పెంచేలా కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular