
రాష్ట్ర మొత్తం అప్పులు ₹6,71,757 కోట్లు.
రాష్ట్ర ఆర్థికపరిస్థితిపై శ్వేతపత్రాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విడుదల చేశారు. ఈ శ్వేతపత్రం 42 పేజీల ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మెుత్తం అప్పులు రూ. 6,71,757 కోట్లు ఉన్నాయి. 2014 -15 నాటికి రాష్ట్ర రుణం రూ.72,658 కోట్లుగా చూపించారు. 2014-15 నుంచి 2022-23 మధ్య కాలంలో సగటున 24.5 శాతం అప్పు పెరిగింది. 2015-16లో రాష్ట్ర రుణ, జీఎస్డీపీ 15 .7 శాతంతో దేశంలోనే అత్యల్పంగా ఉన్నది. 2023-24 అంచనాల ప్రకారం రాష్ట్ర రుణం రూ.3,89,673 కోట్లుగా ఉంది.
శ్వేతపత్రంలోని ప్రధానాంశాలు..
రాష్ట్ర మొత్తం అప్పులు ₹6,71,757 కోట్లు.
• 2014-15 38 0 0 172,658 2. 2014-15 నుంచి 2022-23 మధ్య కాలంలో సగటున 24.5 శాతం పెరిగిన అప్పు.
2023-24 అంచనాల ప్రకారం రాష్ట్ర రుణం ₹3,89,673 కోట్లు.
• 2015-16లో రుణ, జీఎస్జీపీ 15.7 శాతంతో దేశంలోనే అత్యల్పం.
• 2023- 24 నాటికి 27.8 శాతానికి పెరిగిన రుణ, జీఎస్జీపీ శాతం.
• బడ్జెట్కు, వాస్తవ వ్యయానికి మధ్య 20శాతం అంతరం.
• 57 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధికి ₹4.98 లక్షల కోట్ల వ్యయం.
• రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 రెట్లు పెరిగిన రుణభారం.
• రెవెన్యూ రాబడిలో 34 శాతానికి పెరిగిన రుణ చెల్లింపుల భారం
• రెవెన్యూ రాబడిలో ఉద్యోగుల జీతాలకు 35 శాతం వ్యయం
• 2014లో మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ.. 2023లో అప్పుల్లో కూరుకుపోయింది.
• బడ్జెటేతర రుణాలు పేరుకుపోయి అప్పుల ఊబిలో తెలంగాణ



