- Advertisement -
మూసీ బ్యూటిఫికేషన్ కు తొలగుతున్న అడ్డంకులు
Removing barriers to musi beautification
హైదరాబాద్, నవంబర్ 29, (వాయిస్ టుడే)
మూసీ పునరుజ్జీవంపై బిగ్ అప్డేట్ వచ్చింది. అది ప్రభుత్వానికి బూస్టప్ ను ఇచ్చింది. విపక్షాల ఆందోళనలకు చెక్ పెట్టింది. ఒక మంచి పని చేపడితే ఆటంకాలన్నీ ఎలా తొలగిపోతాయో తాజాగా హైకోర్టు తీర్పుతో చాలా ప్రశ్నలకు జవాబులు వచ్చాయి. చాలా సమస్యలకు పరిష్కారం దొరికింది. ఇప్పుడు జస్ట్ వాటిని ఇంప్లిమెంట్ చేయడమే మిగిలింది. సుప్రీం మార్గదర్శకాల ప్రకారం నోటీసులు ఇవ్వడం, రివర్ బెడ్ లో ఆక్రమణలు తొలగించడం అనుకున్నట్లుగా మూసీ ప్రాజెక్ట్ చేయడం ఇక మిగిలింది ఇదే.మూసీపై ఇప్పటికే విపక్షాలు నోటికొచ్చిన అసత్యాలు ప్రచారం చేశారు. లూటిఫికేషన్ అని ఒకరు, నిర్మాణాలు ఎలా తొలగిస్తారని ఇంకొకరు.. మూసీ పునరుజ్జీవం జరగకుండా పోటీ పడ్డారు. నదీ పరివాహకంలో పర్యటనలు చేశారు. ఒకరోజు ఆలౌట్ పెట్టుకుని నిద్రలు కూడా చేశారు. అయితే వాటన్నిటికీ దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యే తీర్పు హైకోర్టు నుంచి వచ్చింది. ఈ తీర్పు చాలా సమస్యలకు చెక్ పెట్టింది. ఇండ్లు కోల్పోతున్న వారికి పరిష్కారం మార్గం చూపించింది. అవును రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొదటి నుంచి మూసీ పునరుజ్జీవంపై చాలా ఫోకస్డ్ గా ఉంటూ వస్తోంది. ఇందుకోసం లండన్ థేమ్స్, సౌత్ కొరియా సియోల్ లోని హాన్ రివర్ పరిశీలించి కూడా వచ్చారు. అలా చేస్తే మూసీకి మహర్దశ వస్తుందని భావించారు. దీనికి డీపీఆర్ రెడీ చేయిస్తున్నారు.ఇంతలోనే ఏదో జరిగిపోతోంది అనుకుని అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ రంగంలోకి దిగాయి. మూసీలో నిర్మాణాలు ఎలా తొలగిస్తారంటూ పోరాటాలకు దిగాయి. ఓవైపు నదికి మహర్దశ తీసుకొస్తామని ప్రభుత్వం అంటే.. అలా ఎలా చేస్తారు.. కమీషన్లే తింటారు.. పేదల సంగతేంటని ప్రశ్నించారు. దీంతో ఆ రెండు పార్టీలకు అభద్రతా భావం పట్టుకుందన్న విషయం ప్రజలకు అర్థమైంది. సో ఇప్పుడు ఇంకో అసలైన విషయం ఏంటంటే మూసీ ఆక్రమణలు తొలగించాల్సిందే అని తాజాగా హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో మ్యాటర్ అంతా పాలకు పాలు, నీళ్లకు నీళ్లు తేలిపోయింది. విపక్షాలు చేస్తున్న ఆందోళనలకు చెక్ పడినట్లయింది. హైకోర్టు ఏం తీర్పు ఇచ్చిందో ఓసారి చూద్దాం.మూసీ పరిధిలోని FTL, బఫర్‌జోన్‌లోని నిర్మాణాలు తొలగించేందుకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. చట్టవిరుద్దంగా, అనధికారికంగా ఉన్న ఇండ్లను ఖాళీ చేయించడం, అలాగే మురుగునీరు, కలుషిత నీరు చేరకుండా చర్యలు చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. ఇదే టైంలో సమగ్ర సామాజిక, ఆర్థిక సర్వే నిర్వహించి మూసీ పునరుజ్జీవంతో ఎవరి ఆస్తులైతే పోతున్నాయో వారికి ప్రభుత్వ విధానాల ప్రకారం సరైన ప్రాంతంలో వసతి కల్పించాలని చెప్పింది. ఆక్రమణలో ఉన్న పట్టాభూములు, శిఖం భూములైతే వారికి సమాచారం ఇవ్వడం లేదా ఆ భూ యజమానులకి నోటీసులు జారీచేసి చట్టం ప్రకారం తగిన పరిహారం చెల్లించడం ద్వారా సేకరించాలని అధికారులను ఆదేశించింది. మూసీ పునరుజ్జీవంలో భాగంగా నివాసాలు ఖాళీ చేయించడం, కూల్చివేతలను సవాల్ చేస్తూ దాఖలైన 46 పిటిషన్లపై జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టి తీర్పు వెలువరించారు. ఒకే అంశానికి సంబంధించిన పిటిషన్లు కావడంతో అన్నింటినీ పరిష్కరిస్తూ నివాసాలను ఖాళీ చేయించేందుకు, ఆక్రమణలను తొలగించేందుకు అధికారులు అనుసరించాల్సిన చర్యలపై కీలక మార్గదర్శకాలు జారీచేసింది హైకోర్టు.సో మూసీ చుట్టూ నెలకొన్న ప్రతిష్టంభనకు చెక్ పడినట్లయింది. ఇప్పటి వరకు ప్రభుత్వం మూసీ రివర్ బెడ్ లో ఉన్న నిర్మాణాలకు RB-X అని మార్కింగ్ చేసింది. దీంతో ఒక్కసారిగా అలజడి రేగింది. నిజానికి వాళ్లను ఖాళీ చేయించేందుకు టైమ్ ఇచ్చారు. మూసీ నదీ FTL, బఫర్ జోన్ వదిలేయండి.. నదీ గర్భంలోనే ఉన్న వాళ్ల పరిస్థితి దారుణంగా ఉంది. టెంపరరీగా అక్కడ ఉంటున్నా.. వరదల సమస్య, దోమల సమస్య, కలుషిత నీటితో అనారోగ్య సమస్యలు ఇవన్నీ వారికి సవాళ్లుగా మారాయి. ఓవైపు ప్రజల ఆరోగ్యం, ఇంకోవైపు మూసీ పునరుజ్జీవం ఈ రెండింటినీ ప్రభుత్వం సవాల్ గా తీసుకుంది. ఇంకా FTL, బఫర్ జోన్ దాకా రాలేదు. అంతలోనే కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే వాటన్నిటికీ పరిష్కారం చూపుతూ హైకోర్టు కీలక మార్గదర్శకాలు రిలీజ్ చేసింది.మూసీ బఫర్‌జోన్, ఎఫ్టీఎల్, రివర్‌బెడ్ జోన్లలోని నిర్మాణాలను తొలగించే సమయంలో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలన్నది హైకోర్టు. అలాగే వీటిని నిర్దిష్ట గడువులోగా తొలగించేందుకు చర్యలు చేపట్టాలన్నది. 2012 బిల్డింగ్ నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలని చెప్పింది. నిబంధనలకు విరుద్ధంగా మూసీ నదిలో నిర్మాణాలుంటే చట్టప్రకారం తొలగించడం, అలాగే మురునీరు మూసీలో కలవకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చింది. మరో ముఖ్యమైన విషయం.. FTL, బఫర్ జోన్లను అధికారులు గుర్తించేందుకు నిర్వహించే సర్వేకు అందరూ సహకరించాలని, అదే సమయంలో నీటిపారుదల, రెవెన్యూ, హైడ్రా, మున్సిపల్ శాఖలకు పోలీసులు సెక్యూరిటీ కల్పించాలన్నది. అంతే కాదు నదులు, నీటి వనరులు, సరస్సులు, చెరువులను ఆక్రమించుకున్న వారిపై ఇరిగేషన్ చట్టం, వాల్టా చట్టం కింద క్రిమినల్ చర్యలు చేపట్టాలని కూడా హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.సుప్రీం గత మార్గదర్శకాల ప్రకారగం సహజ కొండ ప్రాంతాలు, నదులు, రివర్ బెడ్లను ఇండ్ల కోసం కేటాయింపులు జరపరాదన్నది. ఆ ప్రకారమే చెరువుల రక్షణకి జీవో 99 ద్వారా తెలంగాణ ప్రభుత్వం హైడ్రా ఏర్పాటు చేసిందని హైకోర్టు పిటిషన్ విచారణ సందర్భంగా తెలిపింది. తెలంగాణ ఇరిగేషన్ చట్టంలోని నిబంధనల ప్రకారం ప్రత్యేక అధికారిని నియమించుకునే అధికారం కూడా ప్రభుత్వానికి ఉందని హైకోర్టు గుర్తు చేసింది. చెరువులు, నదులు సమాజానికి చెందిన ఆస్తులని, వాటిని ట్రస్టీలుగా అధికారులు నిర్వహిస్తారన్నది హైకోర్టు. అన్నిటికంటే హైకోర్టు పాయింట్ అవుట్ చేసిన ముఖ్యమైన విషయం ఏంటంటే.. చెరువుల్లో ఇళ్ల పట్టాల కేటాయింపు జరిపినా వాటికి చట్టబద్ధతలేదన్నది. ఆ భూముల్లో ప్రభుత్వం ఎవరికైనా ఇళ్ల నిర్మాణం కోసం స్థలం కేటాయించినా.. ఇళ్లపట్టాలు స్వీకరించిన వారికి, సేల్ డీడ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి కూడా ఎలాంటి చట్టబద్ధమైన హక్కులు సంక్రమించవని క్లారిఫికేషన్ ఇచ్చింది. సో ఫైనల్ గా హైకోర్టు ధర్మాసనం చెప్పిందేంటంటే.. మూసీ పునరుద్ధరణకు, పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాలను తప్పుబట్టలేమని. సో ఈ విషయాన్ని విపక్షాలకు డైజెస్ట్ చేసుకుంటాయా?మూసీ పునరుజ్జీవం అనగానే సహజంగానే భారీ అడ్డంకులు వస్తాయని ప్రభుత్వానికి తెలుసు. అయితే వాటికి ఒక్కొక్కటిగా పరిష్కారం దొరుకుతుందన్న పాజిటివ్ వేవ్ తోనే ఉంది. ఉద్దేశం మంచిదైతే ఆటంకాలన్నీ వాటంతట అవే తొలగిపోతాయి కదా. ఇప్పుడు మూసీ విషయంలో మంచి సంకల్పం తీసుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా అడ్డంకులు వాటంతట అవే తొలగిపోతున్నాయి. ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా వేయి సార్లు ఆలోచిస్తా.. అలా ఆలోచించే మూసీ పునరుజ్జీవంపై నిర్ణయం తీసుకున్నానన్నది సీఎం రేవంత్ మాట. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును ప్రైవేటు-పబ్లిక్ పార్ట్ నర్‌షిప్ లో చేపట్టాలని అనుకుంటోంది. ఒకవేళ ప్రైవేట్ సంస్థలు ముందుకు రాకుంటే వివిధ ఆర్థిక సంస్థల నుంచి రుణం తీసుకుని మూసీ ప్రాజెక్టును ప్రభుత్వమే చేపట్టే ఆలోచన కూడా ఉందంటున్నారు.నిజానికి పైసా ఖర్చు లేకుండా ప్రైవేట్ భాగస్వామ్యంతో పనిచేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ రెడీ చేస్తోంది. ప్రపంచంలోనే పేరొందిన 5 సంస్థలను కలిపి కన్సార్టియంగా మార్చి మూసీ ప్రాజెక్టు డీపీఆర్ తయారు చేయిస్తున్నారు. మూసీ రివర్ బెడ్ ఆర్థికంగా ఎలా ఉపయోగపడుతుందనే కోణంలో, అన్ని సాధ్యాసాధ్యాలకు సంబంధించిన అంశాలతో 18 నెలల్లో ఈ డీపీఆర్ రాబోతోంది. ప్రభుత్వ, పీపీపీ, హైబ్రిడ్.. ఈ మూడు పద్ధతుల్లో డీపీఆర్ రెడీ చేయిస్తున్నారు. దీని ఆధారంగా ప్రపంచంలోనే మేలైన మోడల్‌ను ఎంచుకుని మూసీ పునరుజ్జీవ పనులకు శ్రీకారం చుట్టాలన్నది సీఎం ఆలోచన.మూసీ పునరుజ్జీవ పథకాన్ని ఫేజ్-1లో నార్సింగి నుంచి బాపూఘాట్ వరకు 21 కిలోమీటర్ల పొడవున చేపట్టనున్నారు. ఫేజ్-2 నాగోల్ నుంచి బాచారం వరకు ఉంటుంది. మొదటి దశ చేపట్టే ప్రాంతంలో మూసీ వెంట గోల్కొండ, గండిపేట, రాజేంద్రనగర్ మండలాల్లో రక్షణ శాఖకు చెందిన 900 ఎకరాల భూమి ఉంది. బాపూఘాట్ వద్ద నది మధ్యలో ప్రపంచంలోనే అతి పెద్దదైన మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఇందుకోసం ఆ భూమి ఇవ్వాలని పలుసార్లు రాజ్ నాథ్ సింగ్ కు సీఎం సహా మంత్రులు నివేదించారు. అటు టిప్పుఖాన్ వంతెన సమీపంలో ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసి తారామతి బారాదరి తరహాలో ఓ కల్చరల్ సెంటర్ ఏర్పాటుకు ప్రణాళికలు రెడీ చేశారు. మూసీ ఫేజ్-2 ప్రాజెక్టును నాగోల్ తట్టిఅన్నారం నుంచి బాచారం వరకు 10 కిలోమీటర్ల పొడవున చేపట్టాలని ప్రాథమికంగా నిర్ణయించారు. అక్కడ నదీగర్భంలో ఎలాంటి ఆక్రమణలు లేకపోవడంతో పెద్దఎత్తున అభివృద్ధి పనులు చేపట్టవచ్చని తేల్చారు. ఈ ప్రాంతంలో 500 ఎకరాల వరకు భూమి అందుబాటులో ఉంది.బాపూఘాట్ నుంచి నాగోల్ వరకు సుమారు 21 కిలోమీటర్లలో బఫర్ జోన్‌లో దాదాపు 10 వేల వరకు నిర్మాణాలున్నాయి. వారికి భూసేకరణ చట్టం ప్రకారం పునరావాసం, పరిహారం ఇవ్వాలంటే ప్రభుత్వానికి 15 వేల కోట్ల వరకు నిధులు అవసరమవుతాయి. అయితే తాజాగా హైకోర్టు కూడా వారికి పరిష్కారం చూపాలని మార్గదర్శకాలు ఇచ్చింది. ప్రభుత్వ గత నిర్ణయం ప్రకారం మూసీ నది రెండు వైపులా 50 మీటర్ల వరకు బఫర్ జోన్ కింద నిర్మాణాలు తొలగించాలనుకుంటోంది. నిజానికి రివర్ బెడ్ లో ఇండ్లకు మార్కింగ్ చేసినప్పుడు చాలా మందిని ప్రభుత్వమే దగ్గరుండి తరలించింది. వాహనాల్లో సామాన్లు ఎక్కించి, డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించడంతో వారి కళ్లల్లో ఆనందం అంతా ఇంతా కాదు.మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు చేపట్టే ప్రైవేట్ సంస్థలకు పరివాహకంలో సేకరించే భూములను కొన్నేళ్ల పాటు లీజుకు అప్పగించడం ద్వారా ప్రభుత్వంపై ఎలాంటి భారం పడబోదనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అందుకే పునరావాసానికి సంబంధించి మినహా మిగిలిన భారమంతా ప్రైవేటు సంస్థలే భరించే ప్రణాళికనూ సీరియస్ గా టేకప్ చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే మూసీ మురిసిపోవడం ఖాయమే.
- Advertisement -