ప్రముఖ నటుడు నానా పటేకర్ కన్నుమూత

- Advertisement -

ప్రముఖ నటుడు నానా పటేకర్ కన్నుమూత

కార్డియాక్ అరెస్ట్‌తో 75 ఏళ్ల వయసులో తుదిశ్వాస

Renowned actor Nana Patekar passes away.

ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పటేకర్ (75) కన్నుమూశారు. గురువారం తెల్లవారుజామున గోవాలోని తన నివాసంలో ఆయన తీవ్ర కార్డియాక్ అరెస్ట్‌కు గురయ్యారు. ఉదయం 5:20 గంటలకు ఆయన మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.

నానా పటేకర్‌ను అపస్మారక స్థితిలో ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు సుమారు 45 నిమిషాల పాటు సీపీఆర్ చేసి కాపాడేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ ఆయనను రక్షించలేకపోయారు. ఆకస్మిక మరణం నేపథ్యంలో మెడికో-లీగల్ కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు వైద్యులు తెలిపారు.

హిందీ, మరాఠీ చిత్ర పరిశ్రమల్లో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నానా పటేకర్.. పరిందా, క్రాంతివీర్, అబ్ తక్ ఛప్పన్, వెల్‌కమ్ తదితర చిత్రాలతో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశారు. ఆయన మృతితో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular