అద్దెలు కట్టడం లేదు హామీలు అమలు చేయడంలేదు

- Advertisement -

అద్దెలు కట్టడం లేదు
హామీలు అమలు చేయడంలేదు
మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి
హైదరాబాద్

Rents are not paid
Guarantees are not enforced

మూసి పునరుజ్జీవం పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కాదు రేవంత్ రెడ్డి. .ముందు మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయండి,అలాగే అద్దెలు చెల్లించక తాళాలు వేస్తున్న గురుకుల స్కూల్స్,ప్రవేట్ బిల్డింగ్స్ లో నడుస్తున్న ప్రభుత్వ ఆఫీస్ ల అద్దెలు  చెల్లించండని మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు. గురుకుల స్కూల్స్ కు అద్దె భవనాలకు కిరాయి కట్టక తాళాలు వేస్తున్నారు. రుణమాఫీ పైసలు లేవు,రైతు భరోసా కు పైసలు లేవు.మహిళలకు 2500 ఇవ్వడానికి పైసలు లేవు.పెన్షన్ 4 వేలు ఇవ్వడానికి పైసలు లేవు. రెడ్ హిల్స్ లో సబ్ రిజిస్టర్ ఆఫీస్ కు దానికి కిరాయి కట్టక ఆ బిల్డింగ్ ఓనర్ కరెంట్ కట్ చేసి తాళం వేశాడు అంటని అన్నారు.
సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు రెంట్ కట్టడానికి కూడా పైసలు లేవు కానీ లక్ష యాభై వేల కోట్లతో మూసి పునర్జీవం పేరు మీద డబ్బుల రియల్ ఎస్టేట్ దందా చేసి ఆ మూటలు ఢిల్లీకి పంపించాడనికి మాత్రం నీకు డబ్బులు ఉంటాయి. ఇది రాష్ట్ర ప్రజలు గమనించాలి. రాష్ట్ర సంక్షేమం లేదు,కిరాయిలు కట్టుడు లేదు,ప్రభుత్వ కార్యాలయాలు ప్రైవేట్ భవనాలలో ఉంటే అద్దె కట్టరు.కానీ మూసి పెరు తో లక్ష యాభై వేల కోట్లతో డబ్బులు దండుకునే కార్యక్రమం చేస్తున్నారు తెలంగాణ ప్రజలు గమనించాలి అని కోరుతున్నానని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular