9.4 C
New York
Saturday, April 13, 2024

సీఎం రేవంత్ను ఖమ్మం సీటు ఇవ్వాలని కోరా

- Advertisement -

పార్లమెంట్ ఎన్నికల్లో పోటీపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీ.హనుమంత రావు కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం వీహెచ్ మీడియాతో మాట్లాడుతూ..సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఖమ్మం లోక్సభ సీటు కావాలని కోరినట్లు తెలిపారు. ఖమ్మం టికెట్ నాకు ఇస్తే మెజార్టీతో గెలుస్తా అని ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో తన అభ్యర్థిత్వం విషయంలో పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని అన్నారు. అసలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరెవరు ఉన్నారో ప్రజలు తెలియాలని అన్నారు. ఇంకా చాలా విషయాలు బయటకు రావాల్సి ఉందని తెలిపారు. గతంలో హతమైన గ్యాంగ్ స్టర్ నయీం పేదల భూములు లాక్కున్నారని గుర్తుచేశారు. మొత్తం రూ.2500 కోట్ల ఆస్తులు, భూములు లాక్కున్నారని అన్నారు. నయీం మరణం తర్వాత అవన్నీ ఏమయ్యాయి అని అడిగారు. ఒక్క అంశాన్ని కూడా వదలకుండా సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!