- Advertisement -
వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన కృష్ణలంక వాసులు
Residents of Krishna Lanka thanked YS Jagan
విజయవాడ
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పులివెందుల పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్నారు. విజయవాడ కృష్ణలంక ఏరియాలో రిటైనింగ్ వాల్ దగ్గర కృష్ణా నది ప్రవాహాన్ని వైఎస్ జగన్ పరిశీలించారు. మీరు సీఎంగా ఉన్న సమయంలో కట్టించిన రిటైనింగ్ వాల్ వల్లే మా ప్రాణాలు నిలిచాయని వైఎస్ జగన్కు కృష్ణలంక వాసులు కృతజ్ఞతలు తెలిపారు. రిటైనింగ్ వాల్ లేకపోతే పూర్తిగా మా జీవితాలు అతలాకుతలమయ్యేవని అన్నారు. జగన్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సహాయ చర్యల్లో అండగా ఉంటాయని భరోసానిచ్చారు.
- Advertisement -