- Advertisement -
జగిత్యాల
జగిత్యాల రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఎంపీడీవోగా నీర్ల రమాదేవి బాధ్యతలు స్వీకరించారు. అటు జగిత్యాల అర్బన్ మండల పరిషత్ ఎంపీడీవోగా వేముల విజయలక్ష్మి బాధ్యతలు స్వీకరించారు. వేరు వేరుగా జరిగిన ఈ కార్యక్రమాల సందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎంపీడీవోలకు సిబ్బంది పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీవో సలీం, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ రెడ్డి, టైపిస్ట్ లు మాధవి, రమ్య, ఈజీఎస్ ఆపరేటర్ లక్ష్మణ్, సిబ్బంది భాస్కర్, వెంకటరమణ, ప్రవీణ్, పర్యవేక్షకులు గంగాధర్, కార్యాలయ సిబ్బంది,ఈ పంచాయతీ ఆపరేటర్లు, ఉపాధి హామీ పథకం ఏపీవో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -