Sunday, September 8, 2024

నీటి కాలుష్యాన్ని అరికట్టవలసిన బాధ్యత ప్రజలు అందరి పైన ఉంది

- Advertisement -

నీటి కాలుష్యాన్ని అరికట్టవలసిన బాధ్యత ప్రజలు అందరి పైన ఉంది

-ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్

తాడేపల్లిగూడెం,

గోదావరి జలాలు, సముద్ర తీర ప్రాంతాలలో వ్యర్థ పదార్థాలను పారవేయడం ద్వారా జరుగుతున్న నీటి కాలుష్యాన్ని అరికట్టవలసిన బాధ్యత ప్రజలందరి పైన ఉందని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారంనరసాపురంలో పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ మరియు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా సముద్ర తీర ప్రాంతాలలో జరుగుతున్న అభివృద్ధికి ఆటంకం కాకూడదని అభిప్రాయపడ్డారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం  లో ఉన్న సమస్యలపై ఆయన వాతావరణ మరియు పర్యావరణ మంత్రిత్వ శాఖల అధికారుల దృష్టికి పలు సమస్యలను తీసుకువెళ్లారు. తాడేపల్లిగూడెంలో మురుగునీరు పోవడానికి అవుట్ లెట్ లేకపోవడంతో  గోదావరి జలాలతో ప్రవహించే ఏలూరు కాలువలోకి వ్యర్ధాలు కలుస్తున్నాయని ఈ సమస్య పరిష్కారానికి సహాయ సహకారాలు అందించాలని ఆయన అధికారులను కోరారు. ఎప్పటినుంచో అపరిచితృతంగా ఉన్న తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పున ప్రారంభించి మురుగునీరు  నల్లజర్ల రోడ్డు లో ఉన్న మురుగు కాలువకు అనుసంధానం చేసే దిశగా యాక్షన్ ప్లాన్ రూపొందించామని చెప్పారు. తాడేపల్లిగూడెం నీటి కాలుష్యంపై పరిశీలనకు రావాల్సిందిగా అధికారులకు బృందాన్ని ఆయన కోరారు. నీటి కాలుష్యం అరికట్టడం ద్వారా ప్రజారోగ్యం కాపాడుకోవచ్చని ఆయన పలు సూచనలు చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్