Friday, February 13, 2026

రైతు భరోసాపై ఆంక్షలు

- Advertisement -

రైతు భరోసాపై ఆంక్షలు

Restrictions on farmer insurance

హైదరాబాద్, డిసెంబర్ 2 (వాయిస్ టుడే)
తెలంగాణలో తాము అధికారంలోకి రాగానే రైతులకు ఇస్తున్న రైతుబంధు సాయాన్ని రైతు భరోసా కింద పంటకు రూ.7 వేల చొప్పున చెల్లిస్తామని టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి 2023లో ప్రకటించారు. ఏడాది గడిచినా అమలు కాలేదుతెలంగాణలో 2018 నుంచి అప్పటి బీఆర్‌ఎస్‌ సర్కార్‌ రైతులకు రైతుంబంధు పేరుతో పెట్టుబడి సాయం అందించింది. పరిమితితో సంబంధం లేకుండా బీఆర్‌ఎస్‌ సర్కార్‌.. రైతులకు ఎకరాకు రూ.5 వేల చొప్పున పెట్టుబడి అందించింది. గత రబీలో కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వం కొంత మందికి పెట్టుబడి అందించింది. అయితే గడిచిన ఖరీఫ్‌ నుంచి రైతులకు పెట్టుబడి అందడం లేదు. పెట్టుబడి సాయంపై పరిమితి విధించాలని రేవంత్‌ సర్కార్‌ భావించింది. ఈమేరకు మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటుచేసి రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించింది. ఖరీఫ్‌ కాలం పూర్తయినా రైతు భరోసా ఎవరికి ఇవ్వాలో స్పష్టత రాలేదు. ఈ క్రమంలో ఖరీఫ్‌ పెట్టుబడి లేకుండానే సాగింది. ఇక ఇప్పుడు రబీ సీజన్‌ మొదలైంది. ఈనేపథ్యంలో రైతులకు పెట్టుబడి సాయం అందించక తప్పని పరిస్థితి నెలకొంది. ఒకవైపు విపక్షాలు రైతుబంధు ఎత్తివేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని ఆరోపిస్తున్నాయి. మరోవైపు సంక్రాంతి తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి అనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ తరుణంలో సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. రబీ పంటలకు అందించాల్సిన రైతు భరోసా డబ్బులను సంక్రాంతి పండుగ తర్వాత రైతుల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారురైతు భరోసాపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో ఏరాపటు చేసిన కేబినెట్‌ సభ్‌ కమిటీ ఇప్పటికే నివేదిక ఇచ్చింది. ఈ నేపథ్యంలో రైతు భరోసా ఎవరికి ఇవ్వాలనే అంశంపై త్వరలోనే విధి విధానాలు ఖరారు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. డిసెంబర్‌ 9 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో రైతు భరోసా ఎవరెవరికి ఇవ్వాలనే అంశంపై చర్చించి.. విధి విధానాలు ప్రకటించే అవకాశం ఉంది. ఆ తర్వాతే రుణ మాఫీ లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారని సమాచారంఇదిలా ఉంటే.. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరు రూ.21 వేల కోట్ల రుణాలు మాఫీ చేసింది. రూ.2 లక్షల లోపురుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. గత ఆగస్టు 15 నాటికి రూ.18 వేల కోట్లు మాఫీ చేసింది. తాజాగా నాలుగో విడతలో మరో రూ.3 వేల కోటుల మాఫీ చేసింది. ఈ నేపథ్యంలోనే రైతు భరోసా చెల్లింపు జాప్యం జరిగింది.రైతు భరోసా చెల్లింపు ఆలస్యంపై రైతుల అసంతృప్తితో ఉన్నారు. ధాన్యానికి రూ.500 బోనస్‌ కూడా సన్న వడ్లకే ఇస్తున్నారు. దీంతో త్వరలో జరిగే పంచాయతీ ఎన్నికలపై ప్రభావం చూసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్‌రెడ్డి సంక్రాంతి తర్వాత నుంచి రైతు భరోసా డబ్బులు చెల్లించాలని నిర్ణయించారు. ఇందుకు రూ.9 వేల కోట్లు అవసరమవుతాయని భావిస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్