Monday, December 23, 2024

రేవంత్రెడ్డి మూసీలో గోదావరి నీళ్లు పారిస్తానంటున్నాడు

- Advertisement -

రేవంత్రెడ్డి మూసీలో గోదావరి నీళ్లు పారిస్తానంటున్నాడు

Revant Reddy wants to drain Godavari water in Musi

 పేద, మధ్య తరగతి ప్రజల రక్తం, కన్నీళ్లు పారిస్తున్నాడు
హైడ్రా.. హైడ్రా.. హైడ్రొజన్ బాంబులా మారింది
మాజీ మంత్రి హరీష్ రావు
హైదరాబాద్
తెలంగాణ భవన్కు మూసీ సుందరీకరణ బాధితులు వచ్చారు. వారితో మాట్లాడిన మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు  భరోసా కల్పిస్తానిని భరోసా ఇచ్చారు. హరీష్ రావు మాట్లాడుతూ మీ అందరి మాటలు వింటుంటే నాకు బాధగా ఉంది.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా మీ ఏరీయాకు వస్తాం. మీకు మేమంతా అండగా ఉంటామని అన్నారు.
రేవంత్రెడ్డి సోదరునికి నోటీసులిచ్చి 45 రోజులు టైం ఇస్తారా.. పేదోడికైతే రాత్రిరాత్రికే వచ్చి బుల్డోజర్లతో కూలగొడతారా? కాంగ్రెస్ హయాంలోనే బాధితులంతా ఇండ్లకు పర్మిషన్ ఇచ్చిండ్రు. కష్టంతో భూములు కొనుక్కున్నారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మున్సిపాలిటీల కెళ్లి పర్మిషన్ తీసుకున్నారు. ఇళ్లు కట్టుకునేందుకు బ్యాంకు కెళ్లి లోన్లు పెట్టుకున్నారు. ప్రభుత్వానికి ట్యాక్సులు కట్టారు.  1993 కాంగ్రెస్ ప్రభుత్వమే వీరికి పరిష్మన్లు ఇచ్చింది. ఇప్పుడు వాటిని కూల్చడం అన్యాయం. రేవంత్ .. నువ్వు చేస్తున్న గొప్ప పనేంటి..? సుందరీకరణ? కేసీఆర్ మిషన్ భగీరథ పెడితే.. ప్రతీ ఇంటికి నీరంది ప్రజలకు మేలు జరిగింది. కాళేశ్వరం కడితే లక్షాలాది మంది రైతులకు సాగు,తాగు నీరందింది దాని వల్ల ప్రజలకు మేలు జరిగింది. రేవంత్రెడ్డి మూసీలో గోదావరి నీళ్లు  పారిస్తానంటున్నాడు. పేద మధ్య తరగతి ప్రజల రక్తం, కన్నీళ్లు పారించే ప్రయత్నం చేస్తున్నావ్..హైడ్రా.. హైడ్రా.. హైడ్రొజన్ బాంబులా మారింది. ఎవరికీ కంటిమీద కునుకులేకుండా పోయింది.  సోషల్ మీడియాలో వీడియోలు చూస్తే పేదల గుండెలు ఆగిపోతున్నాయ్. పేద, మధ్యతరగతి ప్రజలకు మేలు చేస్తే వాళ్లు దీవెనలు ఇస్తారు. కానీ, వారి ఉసురు తీస్తే శాపనార్ధాలు పెడతారని మర్చిపోకు. రేవంత్.. నువ్వు మంచి పనులు చేయ్. దేవుడు నీకు మంచి అవకాశం ఇచ్చాడు. నువ్వు అధికారంలోకి వచ్చినప్పటి ఒక్క మంచి పనిచేశావా?  నీకు కూల్చడం తప్ప.. కట్టడం తెలీదా? ముర్ఖుడా.. పేదలకు పనికొచ్చే పనిచేయయని అన్నారు.
రాహుల్ గాంధీ.. తెలంగాణలో బుల్డోజర్  రాజ్యం నడుస్తోంది. మీరు దేశమంతా తిరిగి బుల్డోజర్ ఉపన్యాసాలు ఇవ్వడం కాదు. ముందు తెలంగాణాలో బుడ్జోజర్ రాజ్ను ఆపండి. రేవంత్ రెడ్డి.. అఖిలపక్ష మీటింగ్ పెట్టి అందరి అభిప్రాయాలు తీసుకోండి.. ఆ తర్వాతే మూసీ మీద ముందుకెళ్లండి. ముందు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా.. హైడ్రా పేరుతో నాటకాలు ఆడుతున్నావ్.. మూడు విషయాలు మీకు హామీనిస్తాం. 24 గంటలు మా న్యాయవాదుల బృంధం తెలంగాణ భవన్లో ఉంటుంది. వారి నెంబర్ తీసుకోండి.. ఏ అవసరమొచ్చినా.. మా తలుపులు తెరిచే ఉంటాయ్. మీకు మేమంతా రక్షణ కవచంగా నిలబడతాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కలిసి మీ దగ్గరికొస్తాం. మీకు భరోసా కల్పిస్తాం. 10వేల ఇండ్లు ఉన్నాయని ప్రభుత్వం బయలుదేరింది.. కానీ 25వేల ఇండ్లను కూల్చేందుకు సిద్ధమవుతున్నారు, మీకు న్యాయం జరిగేలా కృషి చేస్తాం.. మీరు ఫోన్ చేస్తే.. మేం మీకు అండగా నిలబడతాం. మీరు ధైర్యాన్ని కోల్పోవద్దని అన్నారు.
బాధితులు తమ బాధలు మంత్రి హరీష్ రావు కు వివరించారు. పైసా పైసా కూడబెట్టి కట్టుకున్న ఇల్లు కూలిపోతే తట్టుకునే శక్తి మాకు లేదు, మా గుండే ఆగిపోతుంది. కంటిమీద కునుకు ఉండట్లేదని, మా బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్దం కావట్లేదు.  దయచేసి మాకు న్యాయం చేయండి  పైసా పైసా కూడబెట్టి ఇల్లు కట్టుకున్నాం. అన్నం కూడా తిన్మామో లేదో మాకే తెలుసు. ఎప్పుడు ఏం జరుగుతుందనే ఆందోళనతో క్షణక్షణం భయంతో గడపవలసి వస్తుంది. గొంతులో అన్నం దిగట్లేదని అన్నారు.
అసలు మేము కొన్నప్పుడు ఇలాంటివి ఏవీ మాకు తెలియదు. లక్షల కొద్ది బ్యాంకు లోన్లు తెచ్చి, ఇళ్లు కట్టుకున్నాం. ఇప్పుడు కూల్చేస్తే తమ పిల్లలు రోడ్డున పడతారు.  తెల్లారితే అసలు ఏం జరుగుతుందోనని భయంగా ఉంది.  టీవీ చూస్తుంటే భయం అవుతుందని వాపోయారు. ప్రభుత్వమే తమను మోసం చేస్తే మా బాధ ఎవరికి చెప్పుకోవాలి. ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపడితే, మా సొంత జీతాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇలా అక్రమంగా ఇళ్లు కూల్చేయడం సరికాదని అన్నారు..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్