- Advertisement -
8న రేవంత్ 6 కిలోమీటర్ల పాదయాత్ర
Revanth 6 km walk on 8th
నల్గోండ, నవంబర్ 5, (వాయిస్ టుడే)
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాదయాత్రపై రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది. వలిగొండ టూ బీబీనగర్.. 6 కిలో మీటర్ల మేర పాదయాత్ర చేపట్టనున్నారు సీఎం రేవంత్. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్ట్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. ఈ ప్రాజెక్ట్ మొదలుపెడుతున్నామని ప్రకటించగానే దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయినా ప్రభుత్వం మాత్రం ముందుకే వెళ్తుంది. మూసీకి పునరుజ్జీవం పోసి నల్గొండ ప్రజల కష్టాలు తీర్చుతామని అంటోంది. ఈ క్రమంలో మూసీ వెంట ఉన్న ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు స్వయంగా పాదయాత్ర చేపట్టబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి.తన జన్మదినం సందర్భంగా నవంబర్ 8న కుటుంబ సమేతంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయనున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అనంతరం ఆలయ అభివృద్ధి పనులపై YTDA అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఆపై జిల్లా అధికారులతోనూ సమీక్ష చేపడుతారు. దర్శనం అనంతరం రోడ్డు మార్గాన వలిగొండ మండలం సంగెం గ్రామానికి చేరుకుంటారు సీఎం రేవంత్‌రెడ్డి. భువనగిరి నియోజకవర్గ పరిధిలో బొల్లేపల్లి, సంగెం, భీమలింగం వంతెన వరకు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టే మూసీ పునరుజ్జీవ ప్రజా చైతన్యయాత్రలో సీఎం పాల్గొంటారు. ఆ తరువాత మిషన్ భగీరథ పథకంలో భాగంగా మల్లన్న సాగర్ నుంచి యాదాద్రి జిల్లాకు మంచినీటి సరఫరా కోసం నిర్మించనున్న పైప్‌లైన్ ప్రాజెక్ట్ పైలాన్‌ను ఆవిష్కరిస్తారు.
- Advertisement -