12.2 C
New York
Wednesday, April 24, 2024

బాబు గారిబాటలో రేవంత్

- Advertisement -

బాబు గారిబాటలో రేవంత్
విజన్ 2050…ప్రకటనలు
హైదరాబాద్, ఫిబ్రవరి 21,
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎం, ప్రస్తుతం ఏపీ ప్రతిపక్షనేత నారా చంద్రబాబు నాయుడు బాటలోనే పయనిస్తున్నారు. చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విజన్‌ – 2020 పేరుతో అభివృద్ధి పనులు చేపట్టారు. తర్వాత ఏపీలో విజన్‌ – 2040 అని ప్రకటించారు. కానీ దానిని పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. అయితే రేవంత్‌రెడ్డి మాత్రం ఆంధ్రప్రదేశ్‌ను ఎంతమంది సీఎంలు పాలించినా.. అభివృద్ధి కేవలం చంద్రబాబు హయాంలోనే జరిగినట్లు భావిస్తున్నారు. హైదరాబాద్‌ డెవలప్‌మెంట్‌ ఆయన చలవే అని నమ్మేవారే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నారు. దీంతో సీఎం కూడా చంద్రబాబు స్ఫూర్తితో ఇప్పుడు విజన్‌ – 2050 పేరుతో డెవలప్‌మెంట్‌ ప్లాన్‌ ప్రకటించారు.తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మెగా మాస్టర్‌ ప్లాన్‌ అమలు చేస్తానని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. విజన్‌ – 2050 దిశగా ముందుకు వెళ్తామని ప్రకటించారు. గత 30 ఏళ్లుగా రాజకీయాలు ఎలా ఉన్నా అప్పట్లో సీఎంలు చంద్రబాబునాయుడు, వైఎస్‌.రాజశేఖరరెడ్డి, కేసీఆర్‌లు గత ప్రభుత్వాల నిర్ణయాలనే మరింత పటిష్టంగా అమలు చేశారని చెప్పారు. అందుకే ఔటర్‌ రింగురోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం, హైటెక్‌సిటీ వంటివి అందుబాటులోకి వచ్చాయన్నారు.హైదరాబాద్‌ను మరింత అభివృద్ధి చేయాలని రేవంత్‌ ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే మెట్రోపాలిటన్‌ సిటీగా గుర్తింపు పొందినందున అంతకు మించిన అభివృద్ధికి అందరి సలహాలు, సూచనలు తీసుకోవాలని రేవంత్‌ నిర్ణయించారు. తర్వాత ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని భావిస్తున్నారు. తొందరపాటు చర్యలతో నష్టం జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌ నగరంలోని ఓఆర్‌ఆర్, రీజినల్‌ రింగురోడ్డు మధ్య ప్రాంతాలను ఎంపిక చేసి అర్బన్, సెమీ అర్బన్, రూరల్‌ ప్రాంతాలుగా విభజించాలని ప్రభుత్వం భావిస్తోంది. చైనా తరహాలో 10 నుంచి 15 శాటిలైట్‌ టౌన్‌షిప్‌ల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందిస్తోంది. ఫార్మాసిటీకి కేటాయించిన స్థలంలో కొత్త నగరం ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఒకేచోట ఫార్మసిటీ అని కాకుండా కాలుష్య రహితంగా ఫార్మా విలేజ్‌లను వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని భావిస్తోంది.ఇక మెట్రో విస్తరణకు కూడా ప్రణాళిక రూపొందిస్తోంది. ఎయిర్‌పోర్టు, మియాపూర్‌ నుంచి ఆర్సీ పురం వరకు, రాయద్గుం నుంచి గచ్చిబౌలి మీదుగా అమెరికన్‌ కాన్సులేట్‌ వరకు పొడిగించాలని భావిస్తోంది. ఆర్‌ఆర్‌ఆర్‌ చుట్టూ రైలు సౌకర్యం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!