28.7 C
New York
Sunday, June 23, 2024

సెక్రటేరియెట్ లో రేవంత్ మార్క్… మార్పులు

- Advertisement -

సెక్రటేరియెట్ లో రేవంత్ మార్క్… మార్పులు
హైదరాబాద్, జూన్ 4, (వాయిస్ టుడే)
తెలంగాణ రాజకీయాల్లో నాయకులు తమకు కలిసిరాని భవనాలకు వాస్తు మార్పులు, చేర్పులు చేయడం సహజమే. సొంత భవనాలు అయితే ఎవరికీ నష్టం ఉండదు. కానీ ప్రజాధనంతో కట్టిన భవనాలకు ఎవరికి అనుకూలంగా వారు మార్పులు చేయడం వాటికి ప్రజాధనం ఖర్చు చేయడమే చర్చనీయాంశం అవుతుంది. ఆరు నెలల క్రితం తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. అంతకుముందు బీఆర్‌ఎస్‌ పదేళ్లు అధికారంలో ఉంది. తనకు పాత సచివాలయం అచ్చిరాదని మాజీ సీఎం కేసీఆర్‌ తన హయాంలో పాత సచివాలయం కూల్చి కొత్తది నిర్మించాడు. తర్వాత ఏడాది వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి సీఎం అయ్యారు. ఆరు నెలల తర్వాత ఆయన ప్రారంభించి ఏడాది కూడా కాని కొత్త సచివాలయానికి వాస్తు మార్పులు చేపట్టారు. ఇక ఎమ్మెల్యేలు అయితే.. నియోజకవర్గ కార్యాలయాలు మార్పులు చేయించుకుంటున్నారు. కొంత మంది ఇప్పటికీ తమ కార్యాలయాల్లో అడుగు పెట్టలేదు. ఈ క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి సచివాలయానికి వాస్తు మార్పులు చేయించడం ఇప్పుడు చర్చనీయాంశమైందికేసీఆర్‌ సీఎంగా ఉన్న సమయంలో ప్రగతి భవన్‌లో, తెలంగాణ భవన్‌లో వాస్తు మార్పులు చేయించారు. సచివాలయం పాతది కూల్చి కొత్తది కట్టించారు. తాజాగా కొత్త సీఎం రేవంత్‌ కూడా కేసీఆర్‌ తరహాలోనే వాస్తు మార్పులపై దృష్టిపెట్టారు. పీసీసీ అధ్యక్ష పదవి రాగానే గాంధీభవన్‌కు వాస్తు మార్పులు చేయించారు. ఇప్పుడు కొత్త సచివాలయంలోనూ ఎంట్రీ, ఎగ్జిట్‌లో మార్పులు చేయిస్తున్నారు.తెలంగాణ రాష్ట్ర గీతం, చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులకు నిర్ణయించారు. అయితే.. పలు వివాదాల మధ్యే రాష్ట్ర గీతాన్ని.. ఆవిర్భావ దినోత్సవం రోజున విడుదల చేశారు. కానీ.. తెలంగాణ రాష్ట్ర చిహ్నమైన రాజముద్ర మార్పుపై పెద్ద దుమారం రేగడంతో ప్రజాభిప్రాయానికి వెళ్లాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే.. ప్రస్తుతం తెలంగాణ సచివాలయంలో మార్పులు, చేర్పులు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించడం ఆసక్తిగా మారుతోంది. తెలంగాణ సచివాలయంలోకి సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్ ఎంట్రీ మార్చబోతున్నారు. ఇప్పటివరకు సెక్రటేరియట్ ప్రధాన ద్వారం నుంచి లోపలికి వచ్చిన సీఎం కాన్వాయ్.. ఇకపై వెస్ట్ గేట్ నుంచి లోపలికి ప్రవేశించి.. ఈస్ట్ గేట్ ద్వారా బయటకు వెళ్లనుంది. అటు.. ఐఏఎస్, ఐపీఎస్‌లతోపాటు ఇతర అధికారులు సౌత్‌ గేటు నుంచి రాకపోకలు సాగించనున్నారు. ఇక.. రేవంత్.. సీఎం అయ్యాక తొలిసారి వాస్తు మార్పులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఇప్పటికే.. సెక్రటేరియట్‌లోని సీఎం కార్యాలయం 6వ అంతస్తు నుంచి 9వ అంతస్తుకు మారింది. దానికి అనుగుణంగానే.. ప్రస్తుతం సెక్రటేరియట్‌లోని 9వ అంతస్తులో పనులు కొనసాగుతున్నాయి. దాంతోపాటు.. సచివాలయంలో రేవంత్‌ ప్రభుత్వం మరికొన్ని మార్పులు చేయించనున్నట్లు తెలుస్తోంది. సీఎం ఇప్పటి వరకు మెయిన్‌ గేట్‌ నుంచి సచివాలయంలోకి ఎంట్రీ ఇచ్చారు. కానీ, ఇక నుంచి వెస్ట్‌ గేట్‌ నుంచి సీఎం కాన్వాయ్‌ ఎంట్రీ ఉంటుంది. నార్త్‌ ఈస్ట్‌ గేటు నుంచి ఎగ్జిట్‌ ఉంటుంది. ఇక ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులకు సౌత్‌ గేట్‌ నుంచి ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇప్పటికే అధికారులు దీనిపై కసరత్తు చేస్తున్నారు.ఇక మాజీ సీఎం తన లక్కీ నంబర్‌ ప్రకారం 6వ అంతస్తులో తన కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు రేవంత్‌ తన కార్యాలయాన్ని 9వ అంతస్తులోకి మార్చుకున్నారు. తాజాగా ఈ రెండు అంతస్తులోనూ వాస్తు మార్పులు చేయిస్తున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని మార్పులు ఉంటాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!