శ్రీవారిని దర్శించుకున్న రేవంత్ రెడ్డి దంపతులు
తిరుమల
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి .ఇన్నాళ్లు ఎన్నికల బిజీలో బిజీగా ఉన్న ఆయన దీపావళి సందర్భంగా సతి సమేతంగా తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకున్నారు. టిటిడి అధికారులు రేవంత్ దంపతులకు దగ్గరుండి దర్శనం ఏర్పాట్లు చేయడం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాలు దేశంలో, ప్రపంచంలోనే గుర్తింపు పొందిన రాష్ట్రాలుగా ఎదగాలని…. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. స్వామివారి దర్శనం చేసుకోవడం చాలా సంతోషకరంగా ఉందన్నారు రేవంత్ రెడ్డి. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. త్వరలోనే తెలంగాణలో మంచి రోజులు వస్తాయని… ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారని పేర్కొన్నారు.
శ్రీవారిని దర్శించుకున్న రేవంత్ రెడ్డి దంపతులు
- Advertisement -
- Advertisement -