5.8 C
New York
Friday, February 23, 2024

రేవంత్ రెడ్డి ఆహాంకారంగా మాట్లాడారు

- Advertisement -

రేవంత్ రెడ్డి ఆహాంకారంగా మాట్లాడారు
హరీష్ రావు
హైదరాబాద్
ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూస్తే మీతిమీరిన దోరణి, అహంకారంగా మాట్లాడం జరిగిందీ. నిన్న ఉదయమే పద్మ అవార్డుల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు  అసభ్య పదజాలంతో రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు అని చెప్పారు. ఇక నుండి  అసభ్య పదజాలంతో మాట్లాడమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఉదయం మాట ఇచ్చాడు, సాయంత్రం మాట మార్చాడు. కేసీఆర్  పైన వ్యక్తీగత దూషణలు చేశాడు. కేఆర్ఎంబీ సమావేశంలో ప్రాజెక్ట్ లను అప్పజెప్పారు.  జనవరిలో ఢిల్లీలో జలశక్తి మీటింగ్ జరిగింది.  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ  రాష్ట్రాలకు చెందిన శ్రీ శైలం, నాగార్జున సాగర్ డ్యామ్ లను కేఆర్ఎంబీ కీ అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ డ్యామ్ మీదకు వెళ్ళాలనుకునే వారు ముందుగా సీఆర్పిఎఫ్  పర్మిషన్ తీసుకోవాలని ఒప్పదం చేసుకున్నారు, పత్రికల్లో వార్తలు వచ్చాయి. ప్రాజెక్ట్ లు ఒప్పజెప్పింది నిజంకాకపోతే ఖండన చేయ్యాలి కదా!! ఎందుకు చెయ్యలేదు. రెండో మీటింగ్ ఫిబ్రవరి 1  2024 నాడు హైదరాబాద్ KRMB మీటింగ్ జరిగింది.  పేరా గ్రాఫ్ 3లో క్లియర్ గా ఉన్నదీ. రెండో కేఈఆర్ఎంబీ  మీటింగ్ జరిగిన తరువాత రెండు రాష్ట్రాల ఈఎన్సీలు  లు ప్రెస్ మీట్ పెట్టారు. ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీ  కాంకరెన్స్ అనే పదం స్పష్టంగా వాడారు. 10 యేండ్ల బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా ఎన్నడు కేఆర్ఎంబి  చేతులో పెట్టలేదు. అధికారంలోకీ వచ్చిన రెండు నెలలోనే అవగాహన లేకుండా కేఆర్ఎంబి  కి అప్పగించారు.  బద్దాల పునాదుల మీదా ప్రభుత్వం నడవకూడదు, రాజకీయం నడిచిన ఏం కాదని అన్నారు.
ఐటమ్ నెంబర్ 16.7 లో క్లియర్ గా ఉన్నది.  మే 19న  జరిగిన 17వ కృష్ణా బోర్డు మీటింగ్ లో చూడండి క్లియర్ ఉన్నది. పచ్చి దగుల్బాజీ మాటలు మాట్లాడుతున్నారు . పోతిరెడ్డి పై నాడు మిము పదవుల కోసం పెదవులు ముసుకున్నాం అని మాట్లాడుతున్నారు. ఆనాడు పెదవులు మూసుకుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట రెడ్డీ. 2005 జూలై 4న కాంగ్రెస్ పార్టీ అనుచరిస్తున్న విధానాలకు మేము రాజినామా చేశాం. ఏడాదికాలంలోనే పదవులు వదులుకున్నాం. మేము పుట్టిందే తెలంగాణ కోసం. నల్లగొండ జిల్లాను ముంచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి లాభం చేకూర్చే పులిచింతల ప్రాజెక్టు కడితే ఎన్నడైన మాట్లాడినవా ఉత్తమ్ కుమార్ రెడ్డి అని ప్రశ్నించారు.
మీరు 5 యేండ్లు మంచిగా ఉండి , ఇచ్చిన 420 హామీలు ప్రజలకు అమలు చెయ్యాలి. అసెంబ్లీకైనా ప్రిపేర్ అయ్యు రండి. లాస్ట్ టైమ్ ఎంతైనా మాట్లాడోచ్చు అని మా మైక్ కట్ చేశారు . చివరికి స్పీకర్ గారికీ దండం పెట్టాల్సి వచ్చిందీ. కృష్ణా జలాల పై మాట్లడే అవకాశం అసెంబ్లీలో ఇస్తాంమని అంటున్నారుగా ఇవ్వండి కచ్చితంగా మాట్లాడుతాం. భేషజాలకు పోకుండా అందరం కలిసి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన హక్కులను కాపాడుకుందామని అన్నారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!