- Advertisement -
బి సి ల ను మోసం చేయడానికే రేవంత్ రెడ్డి కుట్ర
Revanth Reddy's conspiracy to cheat BCs
నర్సంపేట
బి సి ల రిజర్వేషన్ అమలు చేయడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్ర పన్నుతున్నారని,నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించాడు.బుధవారం ఖానాపురం మండలం బుధరావుపేట గ్రామంలో పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేశాడు.ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ,కాంగ్రెస్ పార్టీ ధికారంలోకి రాగానే బలహీన వర్గాలకు రిజర్వేషన్లు పెంచి బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ల చట్టబద్ధత కల్పిస్తానని, కామారెడ్డి వేదికగా బీసీ డిక్లరేషన్ సభ పెట్టి బీసీల ఓట్లు దండుకున్న ముఖ్యమంత్రి నయామోసానికి తెరలేపుతున్నాడని విమర్శించాడు.అసెంబ్లీ సాక్షిగా చట్టబద్ధం చేయలేమని చేతులెత్తేసి ముఖ్యమంత్రి బీసీలకు 42 శాతం ఇస్తామని,ఇతర పార్టీలు కూడా ఇవ్వాలని మరో మోసానికి కాంగ్రేస్ పార్టీ పూనుకుంటున్నదని అన్నాడు.100 సంవత్సరాల చరిత్ర ఉందని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకూ స్థానిక సంస్థల్లో బిసిలకు 42 శాతం ప్రజలకు అవకాశం ఇవ్వలేదని తెలిపాడు. ఎన్నికల్లో సీట్ల కోసమే బిసి రిజర్వేషన్ కాకుండా రిజర్వేషన్ చట్టబద్దత కలిపిస్తే అన్ని విధాలా బాగుంటుందన్నాడు.ఇప్పటివరకు ప్రభుత్వం ప్రకటించిన పథకాలు, అమలు చేయకుండా, ప్రజల్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా మోసం చేసిందో బిసి రిజర్వేషన్ కూడా మోసంగా మిగిలిపోతుందన్నాడు. అసెంబ్లీ వేదికగానే కాంగ్రెస్ పార్టీ తప్పుడు లెక్కలతో వాళ్ల బండారం బహిర్గతమైందని అన్నాడు.కెసిఆర్ సారథ్యంలో కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో ఉన్న నిబద్ధత కాంగ్రెస్ పార్టీ చేసిన కులగణ సర్వేలో లేదనేది స్పష్టంగా అర్థమవుతుందన్నాడు.ఇది స్వయంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్న విషయమని తెలిపాడు.అందరికీ రేషన్ కార్డులని.జాబితా అంతా తప్పులతడుకలతో కూడుకున్నాదని అన్నాడు.నా ప్రమేయం లేకుండా నా పేరు కూడా అందులో ఎక్కించి నీచ రాజకీయాలకు పాల్పడ్డ దౌర్భాగ స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నాడు.కుల గణన సర్వేలో 55వ నెంబర్ కాలంలో మీకు రేషన్ కార్డు ఉందా లేదా అని ప్రశ్న ఉంటే దానికి నేను లేదని టిక్ చేస్తే జాబితాలో నా పేరు వచ్చిందన్నాడు.దీన్ని బట్టి చూస్తే ప్రభుత్వ సర్వే ఎంత తప్పులతడుకాగా, లోప భూయిష్టంగా జరిగిందనన్న విషయం ప్రజలకు అర్ధం అయిందాన్నాడు.రేషన్ కార్డుల పంపకం అనేది అబద్ధం, బూటకమని ప్రజలను మోసం చేసే ప్రక్రియ అన్నాడు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, మాజీ ఎంపీపీ, జడ్పిటిసి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, క్లస్టర్ బాధ్యులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, సొసైటీ డైరెక్టర్లు, గ్రామ పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -