- Advertisement -
పాలమూరు కోసం రేవంత్ రిక్వెస్ట్..
Revanth request for Palamuru..
మహబూబ్ నగర్, డిసెంబర్ 3, (వాయిస్ టుడే)
ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే. అవును రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రే అయినా.. పాలమూరుకు మాత్రం జిల్లావాసే. అందుకే సొంత జిల్లాపై ఉన్న మమకారాన్ని మరోసారి బయటపెట్టారు సీఎం. ఈ క్రమంలోనే మహబూబ్‌నగర్ జిల్లా అభివృద్ధికి సహకరించాలని మంత్రులను కోరారు. సీఎం స్థాయిలో తన జిల్లాకు ఏం కావాలో చేసుకునే రేంజ్‌లో ఉన్నా.. రిక్వెస్ట్ మ్యానర్‌లో సహచర మంత్రులను తనదైన స్టైల్లో జిల్లా అభివృద్ధికి హెల్ప్ చేయాలని కోరడం రేవంత్‌రెడ్డి చాకచక్యానికి నిదర్శనమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.తానొవ్వక..నొప్పిం చక ధన్యుడు సుమతి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు సీఎం రేవంత్. అందులోనూ తన సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ అభివృద్ది విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. సీఎం హోదాలో తన జిల్లాకు ఏం కావాలో అది మంజూరు చేసుకునే పొజీషన్‌లో ఉన్న రేవంత్ రెడ్డి..జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. అటు సొంత పార్టీతో పాటు ఇటు అపోజిషన్ నుంచి విమర్శలు రాకుండా స్కెచ్ వేస్తున్నారట. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, సొంత జిల్లాకు ఎక్కువ నిధులను తీసుకెళ్తున్నారనే టాక్ రాకుండా కేర్ తీసుకుంటున్నారట రేవంత్.సొంత జిల్లాకు ఏం కావాలో అది తీసుకెళ్తే.. మిగతా మంత్రులు ఏమనుకుంటారోనని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా.. తన సొంత జిల్లాపై కాస్త ప్రేమ చూపించాలని విజ్ఞప్తి చేయడం ఆసక్తికరంగా మారింది. పాలమూరు జిల్లా అభివృద్ధికి సంబంధించిన ఫైళ్లపై కొన్ని ఎక్కువ సంతకాలు చేయాలని సరదాగా అన్నప్పటికీ.. సీఎం తన సొంత జిల్లా అభివృద్దికి సహకరించాలని మంత్రులను కోరడం ఆయన రాజకీయ చాకచక్యానికి నిదర్శనమంటున్నారు రాజకీయ ఎనలిస్టులు.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నుంచి మొదలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి..ఇలా మంత్రులందరిని మహబూబ్ నగర్ అభివృద్దికి సహకరించాలని స్వయంగా కోరడం సీఎం రేవంత్ రెడ్డికే చెల్లిందనే చర్చ జరుగుతోంది.నీటిపారుదల రంగం నుంచి మొదలు ప్రతి శాఖకు సంబంధించి అభివృద్ది పనుల్లో మహబూబ్ నగర్‌ను దృష్టిలో పెట్టుకుని, పాలమూరు జిల్లా ఫైల్ అనగానే ఏ మాత్రం ఆలోచించకుండా సంతకాలు పెట్టాలని మంత్రులను కోరడం చర్చనీయాంశంగా మారింది. అటు మహబూబ్ నగర్ ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకోవడంతో పాటు మిగతా జిల్లాల ప్రజలు కూడా కన్విన్స్ అయ్యేలా రేవంత్ చాతుర్యం ప్రదర్శించారని అంటున్నారు.ఇదే సమయంలో ఏ మంత్రిత్వ శాఖలో తాను తల దూర్చడం లేదని, తన మంత్రి వర్గంలోని మంత్రులందరికి పూర్తి స్వేచ్ఛ ఉందని చెప్పే ప్రయత్నం చేశారట. ఆఖరికి తన జిల్లా అభివృద్ధిపై కూడా మంత్రులదే ఫైనల్ డెసిషన్ అన్నట్లుగా చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి మంత్రులతో సరదాగా మాట్లాడినా.. ఆయన మాటల్లో చాలా అంతర్యం ఉందన్న చర్చ జరుగుతోంది.
- Advertisement -