రేవంత్ బినామీలపై విచారణ చేయాలి
హైదరాబాద్, ఫిబ్రవరి 4
Revanth should investigate the benami cases.
సీఎం రేవంత్ రెడ్డికి చెందిన బినామీ కంపెనీ బాగోతం, ఆయన చేసిన ఫ్రాడ్ ప్రజలకు తెలియకుండా దాచిపెట్టడానికి బీఆర్ఎస్ నేతలకు వరుస నోటీసులు ఇచ్చారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. సీబీఐ దర్యాప్తునకు ఎన్సీఎల్టీ ఆదేశించిన కేఎల్ఎస్ఆర్ కంపెనీకి తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులు ఎందుకు ఇచ్చిందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అక్రమ సంపాదన కోసమా, లేక బినామీ కంపెనీకి ప్రాజెక్టుల కోసమా, కమీషన్ల కోసమా అని కేటీఆర్ నిలదీశారు. దీనిమీద సీబీఐ, ఈడీ రంగంలోకి దిగి విచారణ చేపట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. న్యాయమూర్తిని సైతం ప్రలోభపెట్టాలని చూశారని పేర్కొన్నారు. బినామీ కంపెనీ కాకపోతే నిషేధం ఉన్న కంపెనీకి రేవంత్ రెడ్డి ప్రాజెక్టులు ఎలా కట్టబెట్టారని, ఆయన పాత్ర ఏంటో తేలాలన్నారు.తెలంగాణ భవన్‌లో బుధవారం నాడు కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి బినామీ కంపెనీ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ‘మూసీ అభివద్ధి పేరుతో 1.5 లక్షల కోట్ల దోపిడీని అడ్డుకున్నది బీఆర్ఎస్, లగచర్లలో తన సొంత అల్లుడి కంపెనీ కోసం ఫార్మా సిటీ పేరుతో గిరిజనుల మీద దాడి చేస్తే స్కాంను బయటపెట్టింది తామేనన్నారు. హెచ్ఐఎల్‌టీ పేరుతో రూ.5 లక్షల కోట్ల భూ భాగోతాన్ని బయటపెట్టాం, సీఎం రేవంత్ రెడ్డి బావమరిది అమృత్ లో చేసిన స్కాంను బయటపెట్టాం. ఇటీవల సింగరేణి బొగ్గుగణుల్లో కాంగ్రెస్ మోసాలను బయటపెట్టింది బీఆర్ఎస్ పార్టీ అని కేటీఆర్ అన్నారు. ఇలాంటి స్కాంలు, కుంభకోణాలు బయటపెడుతున్నందున జనవరి 22, 23 తరువాత మొదట హరీష్ రావు, తరువాత నాకు, సంతోష్ కుమార్, పార్టీ అధినేత కేసీఆర్ కు వరుస నోటీసులు ఇచ్చి సిట్ విచారణకు పిలవడంతో మాకు అనుమానం వచ్చింది. అన్ని విషయాలు గమనిస్తే సీఎం రేవంత్ రెడ్డి బినామా బాగోతం బయటపడింది. జనవరి 23న సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. KLSR ఇన్‌ఫ్రా అనేది రేవంత్ రెడ్డి బినామీ కంపెనీ. మాతో ఆధారాలున్నాయి. దివాళా తీసిన కంపెనీ ఐపీ ప్రొఫెషనల్స్ లేకుండా రూ.6 వేల కోట్ల పనులకు కాంట్రాక్టులు ఎలా వచ్చాయని చూస్తే తెలంగాణలో వచ్చాయి. ఆయన చీఫ్ మినిస్టర్ కాదు, బినామీ చీఫ్ మినిస్టర్ అని అందరికీ తెలుసు. ఈరోజు ఆయన బినామీ మాస్టర్ అని తేలిపోయింది. బ్లాక్ మెయిల్ చేసి గతంలో సంపాదించిన డబ్బును ఆయన బినామీ కంపెనీలకు తరలిస్తున్నాడు. వేల కోట్ల ప్రాజెక్టులను కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ సహా పలు ప్రాజెక్టులు కట్టబెట్టారు. 2018 సెప్టెంబర్ 27న రేవంత్ రెడ్డి, ఆయన బంధువుల మీద ఐటీ రైడ్స్ జరిగాయి. ఆయన బావమరిది కంపెనీ సాయి మౌర్య ఎస్టేట్స్ వాళ్లు ట్యాక్స్ సరిగ్గా కట్టలేదని ఐటీ తెలిపింది. కేఎల్‌ఎస్ఆర్ ఇన్‌ఫ్రా కంపెనీ రేవంత్ దని ఇది ఒక ప్రూఫ్. రేవంత్ రెడ్డి తిరుగుతున్న ల్యాండ్ క్రూజర్ కార్ నెంబర్ టీఎస్ o7 ఎఫ్ఎఫ్ 0009 ఇది కేఎల్ఎస్ఆర్ ఇన్‌ఫ్రా టెక్ కంపెనీ పేరిట రిజిస్టర్ అయింది. రేవంత్ కు కారు ఎందుకు కొనిచ్చారంటే వాళ్లు రియల్ ఎస్టేట్, ఇతర లావాదేవీలు చేస్తున్నారు.
జడ్జిని ప్రలోభపెట్టాలని చూసిన కంపెనీ..
2023 జులైలో కేఎల్ఎస్ఆర్, మరో కంపెని (ఏఎస్ ఎన్విటి)కి గొడవ జరగడంతో ఎన్‌సీఏటీని ఆశ్రయించారు. రేవంత్ రెడ్డికి ఉన్న బుద్ధులే ఈ కంపెనీకి ఉన్నాయి. NCLAT జడ్జి శరత్ కుమార్ తనకు ఫోన్లో మెస్సేజ్ వచ్చిందని, కేఎల్ఎస్ఆర్ కంపెనీకి మద్దతుగా తీర్పు ఇవ్వాలని మెస్సేజ్ రావడంతో ఒత్తిడి తట్టుకోలేక తప్పుకున్నారు. ఆ బినామీ కంపెనీకి రేవంత్ రెడ్డి అండ ఉంది. బనామీ కంపెనీ కేఎల్ఎస్ఆర్ కంపెనీ నుంచి సాయి మౌర్య డెవలపర్స్ లోకి డబ్బులు పెట్టి, భూములు కొని లాభాలు తెచ్చే పనిని భూపాల్ ఇన్ ఫ్రా చూసుకుంటుంది. 2018లోనే రేవంత్ రెడ్డికి బినామీ కంపెనీఅని ఐటీ కంపెనీ రైడ్స్ ద్వారా బయటకొచ్చింది. రేవంత్ సీఎం కాగానే కేఎల్‌ఎస్ఆర్ కంపెనీకి పెద్ద ఎత్తున ప్రాజెక్టులు, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్, జల్ జీవన్ అమృత్ స్కీం కింద 6 వేల కోట్లకు పైగా ప్రాజెక్టులు వచ్చాయి.
మెదక్ లో ఆర్ అండ్ బీకి 111 కోట్లు, షాద్ నగర్, పరిగి రోడ్డు 135 కోట్లు, సూర్యపేట మోతే లిఫ్ట్ ఇరిగేషన్ కు రూ.1910 కోట్లు, రాజీవ్ గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ కోదాడకు 300 కోట్లు, కొడంగల్ లో వెటర్నరీ కాలేజీకి రూ.145 కోట్లు, మిషన్ భగీరథలో 160 కోట్లు ఇలా దాదాపు 6 వేల కోట్లు కేఎల్ఎస్ఆర్ కంపెనీకి ప్రాజెక్టులు వచ్చాయి. అయితే 2023లో కంపెనీ దివాళా తీసింది. దానిపై పిటిషన్ సైతం ఎన్సీఎల్టీలో నడుస్తోంది. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేక అప్పులు తీసుకున్న కేఎల్ఎస్ఆర్ కంపెనీకి రూ.6వేల కోట్లు వచ్చాయంటే ఏ విధంగా నిధులు వచ్చాయో తెలుస్తుంది. ఆర్థిక లావాదేవిలు ఆపివేయాలని జనవరి 23న రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. ఈ కంపెనీకి ఎందుకు ప్రాజెక్టులు ఇచ్చారని కోర్టు ప్రశ్నించినా కార్యకలాపాలు సాగిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలకు వరుసగా నోటీసులు ఇచ్చి విచారణ జరపడం వెనుక రేవంత్ రెడ్డి బినామా బాగోతం సుప్రీంకోర్టులో బయటపడటమే కారణమని’ కేటీఆర్ అన్నారు.


